ఇటీవలే ఆసియా కప్ లో భాగంగా నరాలు తెగే ఉత్కంఠత మధ్య జరిగిన ఫైనల్ పోరులో శ్రీలంక జట్టు 21 పరుగుల తేడాతో విజయం సాధించి ఆరోసారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. అయితే ఒకానొక సమయంలో శ్రీలంక జట్టు ఓడిపోవడం ఖాయమని అందరు అనుకున్నారని చెప్పాలి. ఎందుకంటే 36 పరుగుల కీలకమైన మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన రాజకప్ప  నేనున్నాను అంటూ ఆదుకున్నాడు. ఈ క్రమంలోనే ఒకవైపు ఆచితూచి ఆడుతూనే సమయం వచ్చినప్పుడల్లా సిక్సర్లతో చెలరేగిపోయాడు.



 దీంతో 6 ఫోర్లు 3 సిక్సర్ల సహాయంతో 45 బంతుల్లో 71 పరుగులు చేసి కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించాడు. అంతేకాదు  అద్భుతమైన విజయాన్ని కూడా అందించాడు శ్రీలంక జట్టు విజయం సాధించింది అంటే అది రాజకప్ప బ్యాటింగ్ వల్లనే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా దక్కించుకున్నాడు రాజప్పకప్ప. తీవ్రమైన ఒత్తిడి  ఉన్న సమయంలో కూడా అద్భుతమైన స్ట్రైక్ రేటు తో అతడు రాణించిన తీరు ప్రశంసనీయం అని చెప్పాలి. ఇదే విషయంపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజకప్ప మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు అంటూ ప్రశంసలు కురిపించాడు.



 ఒకవేళ రాజకప్ప ఒత్తిడి ఉన్న సమయంలో ఎక్కువ బంతులు తీసుకుని 70 పరుగులు చేసి ఉంటే ఆ ఇన్నింగ్స్ కు అసలు విలువ ఉండేది కాదు అంటూ వ్యాఖ్యానించాడు. ఆ సమయంలో గేర్ మార్చి సిక్సర్లు ఫోర్ లతో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు అంటూ ప్రశంసించాడు. హాసరంగా చేసిన 31 పరుగులు కూడా జట్టు విజయంలో కీలక పాత్ర వహించాయనీ.. కష్ట  సమయంలో ఒత్తిడిని జయించి భారీ స్కోరు చేయడం గొప్పవిషయం అంటూ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ జట్టు కొన్ని తప్పిదాలు చేయడం కారణంగానే ఓటమి చవిచూసింది అంటూ చెప్పుకొచ్చాడు మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్.

మరింత సమాచారం తెలుసుకోండి: