ఇటీవలే ఆసియా కప్లో భాగంగా ఫైనల్లో అడుగుపెట్టిన భారత్ శ్రీలంక జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రేక్షకులు ఊహించిన దాని కంటే అత్యంత ఉత్కంఠ భరితంగా ఈ మ్యాచ్ జరిగింది. ఒకానొక సమయం లో ఎవరు గెలుస్తారో కూడా తెలియని విధంగా ప్రేక్షకులందరినీ కన్ఫ్యూషన్ లో పడేసింది  అని చెప్పాలి.  ఈ క్రమంలోనే ఎంతో అద్భుతంగా క్రికెట్ ఎంటర్టైన్మెంట్ అందించిన శ్రీలంక పాకిస్తాన్ మ్యాచ్ లో చివరికి 21 పరుగుల తేడాతో శ్రీలంక జట్టు విజయం సాధించి ఆరోసారి ఆసియా కప్ విజేతగా నిలిచి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.




 ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రదర్శన చేసి జట్టుకు విజయాన్ని అందించిన కెప్టెన్ పై.. ఇక ఆసియా కప్ విజేతగా నిలిచిన శ్రీలంక జట్టుపై ప్రస్తుతం అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అని చెప్పాలి. జట్టు సమిష్టిగా రాణించడం కారణంగానే శ్రీలంక జట్టు సక్సెస్ అవ్వగలిగింది అంటూ అభిప్రాయం  వ్యక్తం చేస్తూ ఉన్నారు అందరూ. ఇక భారత మాజీ ఆటగాళ్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ శ్రీలంకకు తన పూర్తిస్థాయి మద్దతు ప్రకటించాడు. ఇక శ్రీలంక జాతీయ జెండాను చేతిలో పట్టుకుని మైదానంలోకి వెళ్లి ఫోజులు ఇచ్చాడు గౌతం గంభీర్. ఇందుకు  సంబంధించిన వీడియోని ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.


 సూపర్ స్టార్ టీం.. నిజంగా ఆసియా కప్ కి అర్హులు.. కంగ్రాట్స్ శ్రీలంక అనే క్యాప్షన్ ను కూడా జోడించాడు గౌతమ్ గంభీర్. అయితే గౌతం గంభీర్ శ్రీలంక జాతీయ జెండా పట్టుకుని మైదానంలో ఫోటోలకు ఫోజులు ఇస్తున్న సమయంలో ఇక అక్కడే స్టేడియం లో ఉన్న శ్రీలంక అభిమానులు అందరూ కూడా కేరింతలు కొట్టారు అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో 58 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన శ్రీలంక జట్టు అనూహ్యంగా అద్భుతంగా పుంజుకుని 170 పరుగుల స్కోరు చేసింది. పాకిస్తాన్ జట్టు 97 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయి బలంగా కనిపించినా టార్గెట్ చేదించ లేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: