మొన్నటి వరకు టీమిండియా జట్టులో సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ కీలక బౌలర్గా కొనసాగాడు. స్వింగ్ బౌలింగ్ తో వికెట్లు తీస్తూ ఎప్పుడు టీమిండియాను విజయతీరాలకు నడిపిస్తూ ఉండేవాడు షమి. ఈ క్రమంలోనే మూడు ఫార్మాట్లలో కూడా కీలక ఆటగాడిగానే కొనసాగాడు. కానీ గత కొంత కాలం నుంచి మాత్రం టి20 లలో ఎక్కువగా అవకాశాలు దక్కించుకోలేక పోతున్నాడు  మహ్మద్ షమి. టి20 లకు పూర్తిగా దూరం అయిపోయాడు అని చెప్పాలి. యువ ఆటగాళ్ల పోటీ నేపథ్యంలో అతను మళ్లీ టి20 జట్టులోకి రావడం కష్టమేనని మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.


 ఈ క్రమంలోనే ఇక టి20 వరల్డ్ కప్ లో మహ్మద్ షమీ ఉంటాడని అభిమానుల ఆశలు పెట్టుకోగా.. అవి నిరాశగానే మిగిలిపోతాయ్ అని అందరూ అనుకున్నారు. కానీ ఎన్నో రోజుల తర్వాత మళ్లీ భారత టీ 20 జట్టు లో మహ్మద్ షమీ చోటు దక్కించుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.  ఇటీవలే వరల్డ్ కప్ జట్టుతో పాటు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా లతో జరగబోయే టి20 సిరీస్ లకు జట్లను కూడా ప్రకటించారు. వరల్డ్ కప్ కి స్టాండ్బై ప్లేయర్ గా షమి, దీపక్ చాహర్ లను తీసుకున్నారు. అదే సమయంలో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా తో టి20 సిరీస్ లో  కూడా మహమ్మద్ షమీనీ ఎంపిక చేయడం గమనార్హం..


ఆస్ట్రేలియాతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చహాల్, అక్షర్ పటేల్, మహ్మద్‌ షమీ, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, దీపక్‌ చాహర్‌

సౌతాఫ్రికాతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చహాల్, అక్షర్ పటేల్, మహ్మద్‌ షమీ, జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్, దీపక్‌ చాహర్‌, అర్షదీప్‌ సింగ్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: