ఆసియా కప్ లో భాగంగా భారత జట్టు నిరాశపరిచింది. ఈ క్రమంలోనే అక్టోబరు నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా ఎలాంటి వ్యూహాలను అనుసరించబోతుంది అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా వరల్డ్ కప్ జట్టు లో ఎవరు స్థానం సంపాదించుకుంటారు అన్నది చర్చనీయాంశంగా మారిపోయింది. ఇకపోతే ఇటీవలే వరల్డ్ కప్ జట్టును ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి.


 ఈ క్రమంలోనే బిసిసిఐ ప్రకటించిన వరల్డ్ కప్ జట్టు పై ప్రస్తుతం తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది అని చెప్పాలి. తమ అభిమాన  క్రికెటర్లకు వరల్డ్ కప్ లో చోటు దక్కింది అని కొంతమంది అభిమానులు ఎంతగానో సంతోష పడుతూ ఉంటే తమ ఆరాధ్య క్రికెటర్ లకు వరల్డ్ కప్ లో చోటు దక్కలేదు అని మరికొంతమంది బీసీసీఐ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. కాగా ఐపీఎల్ ద్వారా మళ్లీ తనలోని టాలెంట్ నిరూపించుకున్న దినేష్ కార్తీక్ ఇండియాలోకి వచ్చి అదే రీతిలో అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు. అతనికి వరల్డ్ కప్ లో చోటు దక్కడం ఖాయం అని అందరూ అనుకున్నారు.


 అనుకున్నట్లుగానే టీ20 ప్రపంచకప్ జట్టులో అతనికి చోటుదక్కింది. దీంతో ఎంతో మంది ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. 37 ఏళ్ల వయసులో తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో అటు టీమిండియాలో చోటు దక్కించుకోవడమే కాదు వరల్డ్ కప్ లో కూడా స్థానం సంపాదించుకోవడం పై హర్షం వ్యక్తం చేశాడు దినేష్ కార్తీక్. ఈ క్రమంలోనే ఈ విషయంపై స్పందిస్తూ కలలు నిజమౌతాయి అంటూ ఒక పోస్టు పెట్టాడు. ఈ క్రమంలోనే దినేష్ కార్తీక్ పోస్ట్ పై స్పందించిన ఎంతో మంది నెటిజన్లు.. మీ జర్నీ ఎందరికో స్ఫూర్తి అని వరల్డ్ కప్ లో రాణించాలి అంటూ రిప్లై ఇస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dk