పాకిస్తాన్ జట్టులో కొన్ని మైనస్ లు ఉన్నాయి. రీసెంట్ గా ముగిసిన ఆసియా కప్ టోర్నమెంట్ లో ఇది తేటతెల్లమైంది. ఆసియా కప్ లో పాకిస్తాన్ మొత్తం 6 మ్యాచ్ లు ఆడింది. కానీ మూడు మ్యాచ్ లు మాత్రమే గెలిచి మూడింట ఓడింది. ముఖ్యంగా శ్రీలంక తో జరిగిన ఫైనల్ లో గెలిచేందుకు వచ్చిన అవకాశాలను అన్నిటినీ జారవిడుచుకుని ఆసియా కప్ ను చేతులారా పోగొట్టుకుంది. అయితే ఒక మ్యాచ్ లో గెలవాలంటే ప్రత్యర్థి బలహీనంగా ఉంటే సరిపోదు...మన బలం ఏమిటో తెలుసుకుని ఆటాడితేనే విజయం వరిస్తుంది. టోర్నీ ఆరంభానికి ముందు టైటిల్ ఫేవరెట్ అనుకున్న పాక్ కాస్తా రన్నర్ అప్ గా మిగిలింది... పైగా ఆఫ్గనిస్తాన్ తో మ్యాచ్ ల చెమటోడ్చి గెలవాల్సి వచ్చింది.

పాక్ జట్టులో కీపర్ రిజ్వాన్ ఒక్కడే సక్సెస్ ఫుల్ గా జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు. ఒకటి రెండు మ్యాచ్ లలో నవాజ్ మరియు బౌలర్లు కూడా తమ పాత్రను సమర్థంగా పోషించారు. ఇక జట్టు విజయాలకు అయినా అపజయాలకు అయినా బాధ్యుడు కెప్టెన్ అని చెప్పాలి. మరి అలాంటి పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అయితే అన్ని విధాలుగా ఫెయిల్ అయ్యాడు. ఒక కెప్టెన్ గా జట్టును ఫైనల్ లో గెలిపించలేకపోయాడు, అదే విధంగా టోర్నీ ఆసాంతం జరిగిన ఆరు మ్యాచ్ లలో కనీసం ఒక్క అర్ధ సెంచరీ కూడా లేదు... అలా బాబర్ ఆజం బ్యాట్సమన్ ఎప్పుడూ లేనంతగా పరుగులు చేయడంలో బాగా ఇబ్బంది పడ్డాడు. అంతే కాకుండా ఫీల్డింగ్ లో కూడా చాలా పొరపాట్లు చేసింది పాక్ జట్టు.  

అయితే ఇటువంటి ప్రదర్శన చేస్తే జట్టుకు విజయాలు దక్కడం కష్టమే. ఇంకా చెప్పాలంటే... బౌలర్లు నసీం షా ఒక్కడే తరచూ వికెట్లు తీస్తూ ఆకట్టుకున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకం అయిన టీ 20 వరల్డ్ కప్ 2022 అక్టోబర్ 16 నుండి మొదలు కానుంది. ఇటువంటి ఆటతీరును ప్రదర్శిస్తున్న పాకిస్తాన్ ప్రపంచ జట్లు అన్నీ పాల్గొనే టోర్నీలో ఎలా నెట్టుకొస్తోంది అన్నది ఇప్పుడు ప్రస్నార్ధకంగా మారింది. మరి ఏ విధంగా తన జట్టును ఈ లోపాలన్నీ అధిగమించి వరల్డ్ కప్ లో రాణిస్తాడు అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: