గత కొంత కాలం నుంచి ఫామ్ కోల్పోయాడు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న విరాట్ కోహ్లి.. ఇటీవలే ఆసియా కప్ లో మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేసి మరోసారి ఫామ్ లోకి వచ్చాను అన్న విషయాన్ని తన బ్యాటింగ్ తో నిరూపించాడు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో ఇక విరాట్ కోహ్లీ ఓపెనర్గా బరిలోకి దిగాడు.  ఈ క్రమంలోనే దాదాపు 1000 రోజుల తర్వాత తన కెరీర్లో 71వ సెంచరీ నమోదు చేశాడు. 61 బంతుల్లో 122 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు అని చెప్పాలి.


 దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా విరాట్ కోహ్లీ పై ప్రశంసల వర్షం కురిపించారు అని చెప్పాలి. అయితే విరాట్ కోహ్లీ మూడవ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన సమయం కంటే గత కొంత కాలం నుంచి ఓపెనర్ గానే ఎంతో బాగా రాణిస్తున్నాడు. మంచి పరుగులు కూడా చేపడుతున్నాడు. ఇటీవలే ఓపెనర్గా వచ్చి ఎన్నో రోజులు నిరీక్షణకు తెర దించుతూ ఏకంగా సెంచరీ కూడా చేశాడు. దీంతో టి20 వరల్డ్ కప్ లో కూడా అతని ఓపెనర్ గా పంపిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇటీవల ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు రోహన్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 టి20 లో విరాట్ కోహ్లీ టీమిండియా ఓపెనర్గా పంపాలని భావిస్తున్నాను. అతను టి20 క్రికెట్ లో అద్భుతమైన ఆటగాడు. పొట్టి ఫార్మాట్ లో విరాట్ సగటు దాదాపు 57 గా ఉంది. అతని స్ట్రైక్ రేట్ దాదాపు 160 గా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.  కోహ్లీ తన చివరి ఇన్నింగ్స్ లో ఓపెనర్ గా వచ్చి వేగంగా సెంచరీ సాధించాడు. బహుశా కోహ్లీ ఓపెనర్గా ఆడాలని అనుకుంటున్నాడేమో.. అయితే కోహ్లీ ఓపెనర్గా వస్తే కె.ఎల్.రాహుల్ స్థానం త్యాగం చేయాల్సి వస్తుంది. మూడవ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ను పంపాలి. అందుకే కె.ఎల్.రాహుల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వస్తే బాగుంటుంది అంటూ రోహన్ గావస్కర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: