ప్రస్తుతం టీమిండియా మహిళల జట్టు ఇంగ్లాండ్ పర్యటన లో ఉంది అన్న విషయం తెలిసిందే. అక్కడ ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుతో 3 టీ20ల సిరీస్ ఆడుతుంది భారత జట్టు. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్లో భాగంగా అద్భుతంగా రాణిస్తుంది అనుకున్న భారత జట్టుకు నిరాశే ఎదురైంది అన్న విషయం తెలిసిందే. బ్యాటింగ్ విభాగంలో సమిష్టిగా రాణించిన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ఇక టీమిండియాపై ఘన విజయాన్ని అందుకుంది. ఇలాంటి సమయంలో ఇక టీమిండియా కష్టాల్లో పడిపోయింది అని చెప్పాలి. సిరీస్ గెలవాలంటే తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలోనే ఇటీవలే భారత మహిళల జట్టు 2వ టి20 మ్యాచ్ ఆడింది అన్న విషయం తెలిసిందే.


 అయితే సిరీస్  అవకాశాలు సజీవంగా ఉండాలంటే భారతజట్టు తప్పక గెలవాల్సిన మ్యాచ్లో.. టీమిండియా తప్పక గెలిచి తీరుతుంది అని అభిమానులు కోరుకున్నారు. అభిమానులు కోరుకున్నదే టీమిండియా చేసి చూపించింది అని చెప్పాలి.  రెండవ టీ 20 మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టును ఓడించి భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా జట్టు 16.2 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది అని చెప్పాలి.


 భారత బ్యాటింగ్ విభాగంలో స్మృతి మందాన 53 బంతుల్లో 13 ఫోర్ల సహాయంతో 79 పరుగులు చేసి మెరుపులు మెరిపించింది. ఇక చివర్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 20 బంతుల్లో 29 పరుగులు చేసి మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. తద్వారా ఎంతో అలవోకగా టీమిండియా విజయం సాధించింది.  అయితే అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.  ఏది ఏమైనా ఇక ఇప్పుడు రెండవ టీ 20 మ్యాచ్లో టీమ్ ఇండియా గెలిచి సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది అని అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. కాగా నిర్ణయాత్మకమైన మూడో టి20 మ్యాచ్ సెప్టెంబర్ 15వ తేదీన జరగబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: