ఇటీవల కాలంలో వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ ఎంత పాపులారిటీ సంపాదించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా ఎంతో మంది యువతకు ఇక ఈ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ ఎంతగానో నచ్చేసింది. అయితే ఇలా డబ్ల్యూడబ్ల్యూఈ చూసేవారికి పాల్ హేమన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు బ్రాక్ లేస్నర్ కు ఇక ఇప్పుడు రోమన్ రేయిన్స్ కి మేనేజర్గా వ్యవహరిస్తూ ఉన్నాడు పాల్ హేమన్.  ఇక తనదైన చేష్టలతో  ఎప్పుడు డబ్ల్యూ డబ్ల్యూఈ లో హాట్ టాపిక్ గా మారూతాడు అనే విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం రోమన్ రేయిన్స్ కి అడ్వైజర్ అండ్ కౌన్సిల్ మేనేజర్గా కూడా వ్యవహరిస్తున్నాడు.  కాగా పాల్ హేమన్ మహేంద్రసింగ్ ధోని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు..


 మహేంద్ర సింగ్ ధోనీ సాధించిన రికార్డులన్నింటినీ కూడా రోమన్ రేయిన్స్ బ్రేక్ చేస్తాడు అంటూ వ్యాఖ్యానించాడు.  అదేంటి ధోనీ క్రికెట్ ఆడితే రోమన్ రేయిన్స్ రెస్లింగ్ ఆడతాడు. వీరిద్దరు వేర్వేరు విభాగాలకు చెందిన వారు ఒకరి రికార్డులను ఒకరు బ్రేక్ చేసుకోవడమేమిటి అనుకుంటారు కదా  అసలు విషయం ఏమిటంటే సెప్టెంబర్ 12న పాల్ హేమన్ 57వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ క్రమంలోనే  పాల్ హేమన్ ట్విట్ పై  స్పందించిన పాల్ హేమన్ బదులిస్తూ 2019లో వరల్డ్ కప్ సందర్భంగా ఎంఎస్ ధోనినీ ఉద్దేశించి ఐసీసీ ట్విట్ కు  రిప్లై ఇచ్చాడు.


 ఈ క్రమంలో పాల్ హేమన్ పెట్టిన పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఒకవేళ రోమన్ రేయిన్స్ గనుక క్రికెట్లోకి దిగితే మహేంద్ర సింగ్ ధోనీ సాధించిన రికార్డులు నెంబర్స్ అన్నింటినీ కూడా బ్రేక్ చేస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు.  ఇది అందరూ తెలుసుకోవాల్సిన నిజం అంటూ తెలిపాడు.  కాగా ఐసిసి పాల్ హేమన్ ను ఉద్దేశిస్తూ ఈట్, స్లీప్, l ఫినిష్ గేమ్స్ రిపీట్ ఎంఎస్ ధోని అంటూ పేర్కొంది. పాల్ హేమన్ గతంలో బ్రాక్ లెస్నర్ కు మేనేజర్ గా ఉన్న సమయంలో ఈట్ స్లీప్ కాంక్వెర్ అనే పదాన్ని తరచూ వాడుతూ ఉండేవాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: