ఇటీవలే ఆసియా కప్లో భాగంగా టీమిండియా ఎంతలా నిరాశపరిచింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే టీమ్ ఇండియా ఆసియా కప్ లో బాగా రాణించలేకపోయింది అనే బాధ కంటే కీలకమైన మ్యాచ్లో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది అన్న బాధ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే ఇక పాకిస్తాన్ గెలుపు భారత ఓటమికి కారణమైన అందరూ ఆటగాళ్లపై కూడా మొన్నటివరకు విమర్శలు వచ్చాయి అనే విషయం తెలిసిందే. కీలకమైన సమయంలో సులభమైన క్యాచ్ వదిలేసినా అర్షదీప్ పై కూడా సోషల్ మీడియాలో ఎంతగానో ట్రోల్స్ వచ్చాయి.


 ఇక ఇలాంటి సమయంలోనే ఎంతో మంది మాజీ క్రికెటర్లు అర్షదీప్ కు మద్దతుగా నిలిచారు అని చెప్పాలి. ఒత్తిడిలో ఇలాంటివి జరగడం సహజం అంటూ పేర్కొన్నారు. అయితే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన అర్ష దీప్ చిన్ననాటి కోచ్ జశ్వంత్ రాయ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్తో మ్యాచ్ తర్వాత నేను అతనితో  మాట్లాడాను. ఆ రాత్రి అతను సరిగా నిద్రపో లేక పోయాను అంటూ తనతో చెప్పుకొచ్చాడు. క్యాచ్ వదిలేసినందుకు ట్రోల్స్ వస్తున్న కారణంగా కాదని ఇలాంటి ట్రోల్స్ అయినా పట్టించుకోను అంటూ చెప్పాడు. కానీ 19 వ ఓవర్లో ఐదో బంతిని ఎందుకు ఫుల్ గా టాస్ యర్కర్ గా మలచ లేకపోయాను అన్నవిషయమే తనను బాధించిందని అంటూ అర్ష దీప్ చెప్పాడని జశ్వంత్ రాయ్ తెలిపాడు.


 ఇక తాను అనుకున్న ప్రణాళికలు అమలు అయి ఉంటే బాగుండేది అని అర్ష దీప్ నిరాశ  చెందాడని చెప్పుకొచ్చాడు.  అయితే ఏదేమైనా ప్రతీ క్రికెటర్ విషయంలో ఇలాంటి తప్పులు జరుగుతూనే ఉంటాయని తప్పులను సరిదిద్దుకుని ప్రతీ క్రికెటర్ కూడా మెరుగ్గా రానించాల్సిన   అవసరం ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు చిన్ననాటి కోచ్ జస్వంత్ రాయ్. ఇక ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయ్ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: