ప్రేక్షకులకు మళ్ళీ టన్నుల కొద్దీ ఎంటర్టైన్మెంట్ ను అందించడానికి పొట్టి ప్రపంచ కప్ వస్తోంది. అక్టోబర్ 16 నుండి నవంబర్ 13 వరకు 29 రోజుల పాటు క్రీడా సంబరం ఎంతగానో అలరించనుంది. ఇందులో టాప్ 12 జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. అయితే చిన్న జట్లు కూడా క్వాలిఫైయర్స్ రూపంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. కాగా ఈ పొట్టి ప్రపంచ కప్ లో పాల్గొనే అన్ని జట్లు ఇప్పటికే తమ టీం వివరాలను ప్రకటించారు. కాగా గత రాత్రి వెస్ట్ ఇండీస్ టీం యాజమాన్యం అధికారికంగా జట్టును ప్రకటించింది. అయితే ఈ జట్టులో గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి అంతర్జాతీయ మ్యాచ్ లకు దూరమైన కొందరు తిరిగి ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకున్నారు.

నిజంగా వారికి ఇది బంపర్ ఆఫర్ అని చెప్పాలి. వారిలో ఈవిన్ లూయిస్, జాన్సన్ చార్లెస్ లు ఉన్నారు. ఇక ప్రస్తుతం వీరు స్వదేశంలో జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్నారు. కాగా జట్టును ప్రకటించిన వెంటనే చాలామందికి షాక్ తగిలింది అని చెప్పాలి. ఎందుకంటే టీ 20 ఫార్మాట్ లో ప్రపంచ వ్యాప్తంగా టోర్నీలు ఆడుతూ కీలక ఆటగాళ్లుగా ఉన్న ఇద్దరికి ఈ వరల్డ్ కప్ టీం లో సెలెక్ట్ చేయలేదు. వీరు ప్రస్తుతం గొప్ప ఫామ్ లో లేకపోయినా ఏ క్షణం అయినా మ్యాచ్ ను మలుపు తిప్పగల సమర్థులు. ఇద్దరూ కూడా ఆల్ రౌండర్ లు కూడా మరో ప్రత్యేకత. వారు ఎవరంటే... అండ్రే రస్సెల్ మరియు సునీల్ నరైన్.

ప్రస్తుతం వీరు అంత గొప్ప ఫామ్ లో ఏమీ లేకపోయినా అనుభవజ్ఞులైన వారు జట్టులో ఉంటే కీలక సమయంలో జట్టు విజయావకాశాలు మెరుగుపడే ఛాన్సెస్ ఉంటాయి. కానీ వెస్ట్ ఇండీస్ క్రికెట్ యాజమాన్యం ఇంత షాకింగ్ నిర్ణయం తీసుకుంటారని ఎవ్వరూ అనుకోలేదు. ఇక వాస్తవంగా చెప్పాలంటే వీరిద్దరికీ కూడా దేశం తరపున ఆడడం కన్నా లీగ్ లలో ఆడడమే ఎక్కువ ఇష్టం అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: