ఇటీవల ముగిసిన ఆసియా కప్ టోర్నీ కొందరి కెరీర్ ను పైకి తీసుకెళ్లింది. మరికొందరి కెరీర్ ను పాతాళానికి తొక్కేసింది. అయితే ఆసియా కప్ వలన ఒక ఆటగాడు ఇప్పుడు ఏకంగా ప్రపంచ కప్ లాంటి టోర్నీలో మెయిన్ జట్టులో చోటును కోల్పోయాడు. ఇంతకీ ఎవరు ఆ ఆటగాడు ఏమి జరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ జట్టు ముఖ్యంగా ప్రపంచ కప్ లాంటి టోర్నీలో అసాధారణమైన ఆటతీరును కనబరిచి ప్రత్యర్థులకు షాక్ ఇస్తూ ఉంటుంది. గత టీ 20 వరల్డ్ కప్ లో ఇండియాను ఓడించి గ్రూప్ దశలోనే టోర్నీ నుండి నిష్క్రమించేలా చేసింది. కాగా ఆసియా కప్ టోర్నీని ఫేవరిట్స్ గా స్టార్ట్ చేసి రన్నర్ అప్ గా సరిపెట్టుకుంది. దీనికి ప్రధాన కారణం బ్యాత్సమం వైఫల్యం అని చెప్పాలి.

ముఖ్యంగా శ్రీలంక లాంటి జట్టు మీద రెండు సార్లు ఓడిపోయింది. అయితే గత కొంతకాలంగా పాకిస్తాన్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న ఫఖార్ జమాన్ ఈ టోర్నీలో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. మొత్తం ఆరు మ్యాచ్ లలో బ్యాటింగ్ చేసిన ఫకార్ కేవలం ఒక్క అర్ద సెంచరీతో 96 పరుగులు మాత్రమే చేయగలిగాడు. వన్ డౌన్ గా బ్యాటింగ్ కు వచ్చిన జమాన్ కీలకమైన సమయంలో కూడా జట్టును ఆదుకోలేక ఫెయిల్ అయ్యాడు. ఇక శ్రీలంక తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అయితే తాను ఈదుకొన్న తొలిబంతికే వికెట్ల మీదకు బంతిని ఆడుకుని బౌల్డ్ అయ్యాడు. ఈ ప్రదర్శన అతని పాలిట శాపమైంది. కొద్ది సేపటి క్రితం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అక్టోబర్ 16 నుండి జరగనున్న టీ 20 ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించింది.

అయితే ఈ జట్టులో పాకిస్తాన్ తరపున వన్ డే లలో డబల్ సెంచరీ చేసిన ఒకే ఒక్కడు ఫఖార్ జమాన్ కు మెయిన్ జట్టులో చోటు దక్కలేదు. అంటే... 15 మందితో కూడిన ప్రాబబుల్స్ లో జమాన్ చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే తూతూ మంత్రంగా రిజర్వు ప్లేయర్స్ 4 లలో ఒకడిగా ఎంపిక చేసింది. అయితే ఆల్రెడీ జట్టులో ఉన్న ఎవరికైనా గాయం కారణంగా ఆడలేకపోతే మాత్రమే ఇతను ఆడడానికి అవకాశం ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: