గత కొంతకాలం నుంచి భారత మహిళల జట్టు బాగా రాణిస్తుంది. విద్యార్థులకు  గట్టి పోటీ ఇస్తు వరుస విజయాలు సాధించింది. పురుష క్రికెటర్లకు తాము ఎక్కడ తక్కువ కాదు అని ఎంతో మంది మహిళా క్రికెటర్లు నిరూపిస్తున్నారు. పురుష క్రికెటర్లకు పోటీ ఇస్తూ రికార్డును సైతం కొల్లగొడుతున్నారు.  అంత బాగానే ఉన్నాను ఎందుకో భారత మహిళల జట్టు కీలకమైన మ్యాచ్లలో మాత్రం చేతులెత్తేస్తుంది అని గత కొన్ని రోజుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు  వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. గత నెలలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో  టీమిండియా జోరు చూస్తే బంగారు పతకం మనదే అని అనిపించింది.


 కానీ తీరా ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి చివరికి సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకుంది భారత మహిళల జట్టు. ఇకపోతే ప్రస్తుతం హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో ఇంగ్లాండ్ పర్యటన లో ఉన్న భారత మహిళల జట్టు అక్కడ టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. ఇందులో భాగంగా మొదటి 20 మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఇక రెండో టి 20 మ్యాచ్ పుంజుకున్న టీమ్ ఇండియా గెలిచి సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. చావో రేవో తేల్చుకోవాల్సిన మూడో టి20 మ్యాచ్ లో మాత్రం చేతులెత్తేసింది.


 ఇంగ్లాండ్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా టీ20 సిరీస్ లో ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా జట్టు ఫేవరెట్ కానీ బ్యాటింగ్ ప్రారంభించిన తర్వాత భారత బ్యాటింగ్ విభాగం పేకమేడలా కూలిపోయింది. షఫాలి వర్మ (5), స్మృతి మంధాన (9), తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (0), హర్మన్ ప్రీత్ కౌర్ (5), హేమలత (0) పెవిలియన్ కు వరుసగా క్యూ కట్టారు. దాంతో 11/0గా ఉన్న భారత్.. కాసేపటికే 21/4గా నిలిచింది. అంటే 10 పరుగుల తేడాలో 4 కీలక వికెట్లను కోల్పోవడం గమనార్హం . ఒక దశలో భారత్ 100 పరుగుల మార్కును అయినా చేరుకుంటుందా అని అందరూ అనుమానపడ్డారు . తర్వాత రిచా ఘోష్ (33), పూాజా వస్త్రాకర్ (19) నిలకడగా రాణించడంతో భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 122 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ జట్టు 18.2 ఓవర్లలో టార్గెట్ చేధించి విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: