ఐపీఎల్లో  ప్రదర్శన ఆధారంగా  తక్కువ సమయం లోనే టీమిండియా జట్టులో అవకాశం దక్కించుకున్నాడు ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్. అటు టీమిండియాకు ఆల్రౌండర్ల కొరత వేధిస్తోన్న సమయం లో ఇతడు ఒక మంచి ఆప్షన్ గా మారి పోయాడు. ఈ క్రమం లోనే టీమిండియా సెలెక్టర్లు ఇతనికి అవకాశాలు కూడా ఇచ్చారు. కానీ తనను తాను నిరూపించు కోలేక పోయాడు  అని చెప్పాలి. అయినప్పటికీ టీమిండియా సెలెక్షన్ కమిటీ అతన్ని కొనసాగిస్తూ వచ్చింది.  చివరికి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సూపర్ కం బ్యాక్ తో వెంకటేష్ కు జట్టు లో స్థానం లేకుండా పోయింది అని చెప్పాలి.


 కాగా టీమిండియా జట్టులో చోటు కోల్పోయిన చాలా రోజులు అవుతుంది. కాగా ప్రస్తుతం వెంకటేష్ అయ్యారు దులీప్ ట్రోఫీ లో భాగంగా బరి లోకి దిగుతున్నాడు. సెంట్రల్ జోన్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవలే వెస్ట్జోన్ తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న సమయం లో వెంకటేష్ తీవ్రం గా గాయ పడ్డాడు. బౌలర్ చింతల్ గజా వేసిన బంతి వెంకటేష్ అయ్యర్ మెడకు బలంగా తగిలింది. దీంతో గాయం తో విల విలలాడి పోయిన వెంకటేష్ అయ్యర్ రిటైర్డ్ హార్ట్ గా క్రీజు నుంచి బయటికి వెళ్లి పోయాడు.


 అయితే వెంకటేష్ అయ్యర్ గాయ పడిన వెంటనే మైదానం లోకి ఆంబులెన్స్ దూసుకొచ్చింది. దీంతో అతని ఆంబులెన్స్ లో ఎక్కించుకొని మైదానం దాటించాడు. కోయంబత్తూరు లోని ఎస్ ఎన్ ఆర్ క్రికెట్ కాలేజీ గ్రౌండ్ లో ఈ మ్యాచ్ జరిగింది. అయితే చికిత్స తీసుకున్న అనంతరం వెంకటేష్ అయ్యర్ తిరిగి బ్యాటింగ్ కి రావడం గమనార్హం.  దీంతో అభిమానులు అందరూ కూడా ఊపిరిపీల్చుకున్నారు అని చెప్పాలి. వెంకటేష్ అయ్యర్ గాయపడిన తర్వాత ఇలా మైదానంలోకి అంబులెన్సు రావడంతో ఎంతోమంది అభిమానులు కంగారు పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: