మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. టి20 వరల్డ్ కప్ లో భాగంగా సత్తా చాటి విశ్వవిజేతగా నిలవడమే లక్ష్యంగా ప్రతి జట్టు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది. ఇప్పటికే అన్ని జట్లు కూడా వరల్డ్ కప్ లో పాల్గొని తమ జట్టులోని సభ్యులు వివరాలు అధికారికంగా ప్రకటించాయి. అదే సమయంలో ఇక ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు వ్యూహాలను కూడా సిద్ధం చేసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో ఇక ప్రత్యర్ధి దేశాల బ్యాట్స్మెన్ లకు శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు.


 శ్రీలంక స్పిన్ ఆల్రౌండర్ వానిందు హసరంగా తో అందరూ జాగ్రత్తగా ఉండాలి అంటూ సూచనలు చేశాడు. అతన్ని ఏమాత్రం లైట్ తీసుకున్న ఇక మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించాడు. మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియా పిచ్లపై హసరంగా  మరింత ప్రమాదకరం అవుతాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇటీవలే ఆసియా కప్ శ్రీలంక గెలవడంలో అతను కీలకపాత్ర వహించాడు అన్న విషయం తెలిసిందే. తొమ్మిది కీలకమైన వికెట్లు తీయడంతో పాటు విలువైన పరుగులు చేశాడు.


 లెజెండ్స్ లీగ్ రెండో ఎడిషన్ కోసం ఇటీవలే భారత్కు వచ్చిన మురళీధరన్  మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా హసరంగాపై ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రపంచ కప్ లో అతని ఆటను చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు. అతను ఒక గొప్ప బౌలర్ గా ఎదిగాడు గత రెండేళ్ల నుంచి అసాధారణ ప్రదర్శన చేస్తున్నాడు.  అతడు కుర్రాడే అయినప్పటికీ ప్రపంచ కప్ లో మాత్రం డేంజరస్ బౌలర్ అని చెప్పగలను.  ఫింగర్ స్పిన్నర్ల కంటే లెగ్ స్పిన్నర్లకు కాంత అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది. అతను స్పిన్ బౌలింగ్ లో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడాల్సి ఉంటుంది. లైట్ తీసుకుంటే మూల్యం చెల్లించుకోవాల్సిందే అంటూ హెచ్చరించాడు ముత్తయ్య మురళీధరన్.

మరింత సమాచారం తెలుసుకోండి: