ఇండియాలో ఏటా జరిగే క్రికెట్ లీగ్ ఐపీఎల్ గురించి ఎవ్వరిని అడిగినా కథలు కథలుగా చెబుతారు. ఈ లీగ్ వచ్చిందంటే చాలు దాదాపు రెండు నెలల పాటు మంచి క్రీడా వినోదాన్ని పంచుతుంది. అంతే కాకుండా ఇది ప్రపంచంలోనే క్యాష్ రిచ్ లీగ్ గా పేరు తెచ్చుకుంది. దీనిని అణగదొక్కడానికి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో క్రికెట్ లీగ్ లు వచ్చినా ఇంతలా ఏదీ సక్సెస్ కాలేదు. కాగా ఐపీఎల్ ఇప్పటి వరకు 16 సీజన్ లను పూర్తి చేసుకుంది. ఇక ఇందులో ఎంతో సక్సెస్ ఫుల్ జట్లుగా చెన్నై , ముంబై, కోల్కతా లు మంచి పేరు తెచ్చుకున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ లో పది జట్లు ఉన్నాయి.

గత సంవత్సరం కొత్తగా లక్నో మరియు గుజరాత్ జట్లు తమ మొదటి సీజన్ ను పూర్తి చేసుకున్నాయి. పైగా గుజరాత్ ఆడిన మొదటి సీజన్ లోనే అందరినీ వెనక్కు నెట్టి టైటిల్ ను కైవసం చేసుకుంది. కాగా వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం అన్ని ఫ్రాంచైజీలు గట్టిగా ప్రిపేర్ అవుతున్నాయి. ఇందులో భాగంగా ప్రదర్శన బాగాలేని టీం మెంటార్స్, కోచ్ లను మారుస్తూ వస్తున్నారు. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం పంజాబ్ కింగ్స్ జట్టు కు హెడ్ కోచ్ గా ఉన్న అనిల్ కుంబ్లే ను తీసివేస్తూ జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. పంజాబ్ ఇప్పటి వరకు కేవలం ఒక్క సీజన్ లో మాత్రమే రన్నర్ అప్ గా నిలిచింది. ఇదే దానికి అత్యుత్తమ ప్రదర్శన.

అందుకే మొదటి నుండి కూడా కోచ్ లను మార్చింది. కానీ ఫలితం దక్కలేదు... కాగా ఇప్పుడు వచ్చే సీజన్ కోసం పంజాబ్ కు కోచ్ గా మాజీ ఇంగ్లాండ్ కోచ్ ట్రెవర్ బేలిస్ ను నియమించుకుంది. ఈ విషయాన్ని పంజాబ్ జట్టు యాజమాన్యం అధికారికంగా తెలిపింది. ఇక ఖచ్చితంగా ప్రస్తుతం పంజాబ్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న మయాంక్ అగర్వాల్ ను కూడా మార్చాలని చూస్తోంది. మరి ట్రెవర్ బేలిస్ అయినా పంజాబ్ ను విన్నర్ గా నిలుపుతాడా అన్నది తెలియాలంటే వచ్చే సీజన్ వరకు వేచి చూడాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: