గత కొంత కాలం నుంచి ఫామ్లో లేడు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవలే ఆసియా కప్ లో భాగంగా భారీగా పరుగులు చేసి మళ్లీ మునుపటి ఫామ్ ను అందుకున్నాడు అనే విషయం తెలిసిందే. 13 ఏళ్ల తర్వాత సెంచరీ చేసి అభిమానుల అందరినీ కూడా ఆనందంలో ముంచేశాడు. ఈ క్రమంలోనే కోహ్లీపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఇటీవలే కోహ్లీ ఆటతీరుపై ఆస్ట్రేలియా ఫేస్ దిగ్గజం బ్రెట్లీ స్పందిస్తూ  ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీనీ మించినోడు ఈ భూ ప్రపంచం లో లేడు అంటూ ఆకాశానికి ఎత్తేశాడు.  కోహ్లీ లాంటి ఆటగాడు తరానికి ఒకరు పుడతారని పొగడ్తలతో ముంచెత్తాడు.. సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, జాక్ కలిస్ ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ వీరంతా క్రికెట్ లో ఆణిముత్యాలు అంటూ కొనియాడాడు.


 ఇక ఎంతో మంది ప్రేక్షకుల లాగానే తాను కూడా విరాట్ కోహ్లీకి వీరాభిమానిని అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అతన్ని ఎంత రన్ మెషిన్ అని అభిమానులు పిలుచుకుంటే మాత్రం ప్రతి మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాలని ఆశించడం మాత్రం అత్యాశే అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇది అతని పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి కూడా పెంచుతుంది అని తెలిపాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ. ఒక వెయ్యి ఇరవై రోజులపాటు విరాట్ కోహ్లీ సెంచరీ చేయకపోవడానికి కారణం కూడా ఇదే అంటూ తెలిపాడు.


 130 కోట్ల మంది భారతీయులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు కోహ్లీ నుండి ప్రతి మ్యాచ్లో సెంచరీ ఆశించడం సబబు కాదు అంటూ చెప్పుకొచ్చాడు. కోహ్లీ సెంచరీ కాకుండా తక్కువ పరుగులు చేస్తే దానిని బూతద్దంలో చూడటం ఇప్పటికైనా మానుకోవాలి. అతని పాటికి అతని వదిలేస్తే ఎప్పుడూ సత్ఫలితాలు వస్తాయి. ప్రపంచ క్రికెట్ లో విరాట్ కోహ్లీ కోహినూర్ డైమండ్ లాంటివాడు ఆల్ టైం గ్రేట్ అంటూ బ్రెట్లీ విరాట్ కోహ్లీ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక ఇటీవలే విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన నేపథ్యంలో ఎంతో మంది మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కోహ్లీ ఆటతీరుపై తమ అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: