ఇటీవలికాలంలో భారత బౌలింగ్ విభాగంలో బాగా గుర్తింపు సంపాదించుకునీ తన ప్రతిభతో అందరిని ఆశ్చర్యపరుస్తున్న యువ బౌలర్ అర్షదీప్ సింగ్. ఐపీఎల్ లో అద్భుతమయిన ప్రదర్శన చేసి భారత సెలెక్టర్లు చూపును ఆకర్షించిన అర్షదీప్ సింగ్ తక్కువ సమయంలోనే అటు టీమిండియాలో చోటు సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఎంతో మంది సీనియర్లను సైతం పక్కన పెట్టిన.. ఆసియా కప్ టోర్నీలో అర్షదీప్ సింగ్  మాత్రం బౌలర్గా ఎంపికయ్యాడు. ఇక తనదైన బౌలింగ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి.


 అంతర్జాతీయ క్రికెట్లో తక్కువ అనుభవం ఉన్నప్పటికీ డెత్ ఓవర్లలో ఎంతో కట్టుదిట్టమైన బౌలింగ్ చేస్తూ ఇక మాజీ క్రికెటర్ల ప్రశంసలు కూడా అందుకున్నాడు. తన ప్రతిభతో టీమిండియాలో కీలక బౌలర్గా ఎదుగుతున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాగా ఇటీవల కాలంలో అతని బౌలింగ్ ప్రతిభపై  ఎంతో మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో పాకిస్థాన్ మాజీ ఆటగాడు ఒకరు మాత్రం నోరు పారేసుకున్నాడు. అతను చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయ్.



 పాకిస్థాన్ మాజీ పేసర్ అకిబ్ జావేద్ టీమిండియా యువ బౌలర్ అర్షదీప్ సింగ్ పై అక్కసు వెళ్లగక్కాడు. అతను ఒక సాదాసీదా బౌలర్ అని.. ఇలాంటి బౌలర్లను ప్రత్యర్థులు పెద్దగా లెక్కచేయరు అంటూ వ్యాఖ్యానించాడు. టి20 ఫార్మాట్లో భువనేశ్వర్ కుమార్ లాగా బంతిని స్వింగ్ చేసే బౌలర్ కావాలి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. లాగ అర్షదీప్ సింగ్ ఇప్పటివరకు 11 టి20 మ్యాచ్ లలో 14 వికెట్లు తీశాడు.  ఈ క్రమంలోనే అతని ప్రతిభకు మెచ్చిన భారత సెలెక్టర్లు టి20 వరల్డ్ కప్ లో కూడా యువ బౌలర్ కి చోటు ఇచ్చారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే అర్షదీప్ సింగ్ పై పాకిస్థాన్ మాజీ పేసర్ ఆకిబ్ జావేద్ చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: