టి20 వరల్డ్ కప్ లో భాగం గా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో  కప్పు గెలవాలని లక్ష్యం తో బరిలోకి దిగేందుకు సిద్ధమైన టీమిండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది అన్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్ల నుంచి టీమిండియా జట్టు లో కీలకంగా కొనసాగుతూ.. ఇండియా సాధించిన ప్రతి విషయంలో కీలకపాత్ర వహిస్తూ అసలు సిసలైన నిఖార్సయిన ఆల్రౌండర్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న రవీంద్ర జడేజా మోకాలి గాయం కారణంగా టీమిండియా జట్టుకు దూరమయ్యాడు.

 ఆసియా కప్లో భాగంగా రెండు మ్యాచ్లు ఆడిన రవీంద్ర జడేజా ఇక ఆ తర్వాత స్కై డైవింగ్ చేస్తున్న సమయంలో ఏదో స్టంట్ చేయబోయి చివరికి మోకాలి గాయం బారిన పడ్డాడు. చివరికి అతనికి సర్జరీ చేయగా ఆరు నెలల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు నిర్ధారించారు. తద్వారా అటు ఆసియా కప్లో కొన్ని మ్యాచ్ లతో పాటు టి20 వరల్డ్ కప్ కి కూడా దూరమయ్యాడు రవీంద్ర జడేజా. అలాంటి అద్భుతమైన ప్లేయర్ టీమిండియాకు దూరం కావడం మాత్రం ఒక పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి.


 ఈ క్రమం లోనే ఇదే విషయం పై స్పందిస్తూ ఎంతో మంది మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు. కాగా శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్ధనే కూడా ఈ విషయం పై స్పందించాడు. టి20 వరల్డ్ కప్ కి స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టీమిండియాకు దూరం కావడం పూడ్చ లేని లోటే. అంతర్జాతీయ క్రికెట్ లో ఉన్న ఆల్ రౌండర్ లో టాప్ ఫైవ్ లో జడేజా ఉంటాడు. ఇక అలాంటి ఆటగాడు  లేకుండా ఆడటం చాలా కష్టమే అంటూ జయవర్దనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరి కొంత మంది మాజీ క్రికెటర్లు కూడా ఇదే  రీతిలో  స్పందిస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: