గత కొంతకాలం నుంచి టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ చటేశ్వర్ పుజారా తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. భారత జట్టులో టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ గా గుర్తింపు సంపాదించుకోవడంతో పరిమిత ఓవర్ల ఫార్మాట్కు చటేశ్వర్ పుజారా పూర్తిగా దూరమైపోయాడు. ఈ క్రమంలోనే కేవలం టెస్టు జట్టులో మాత్రమే ఆడుతూ వస్తున్నాడు. అలాంటి చటేశ్వర్ పుజారా ఇటీవల ఫామ్ కోల్పోవడంతో టెస్టు జట్టుకు కూడా దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మళ్లీ తన మునుపటి ఫామ్ అందుకునీ టీమిండియా లోకి వచ్చేందుకు ఇంగ్లాండ్ కౌంటి లలో ఆడుతున్నాడు.


 మొన్నటికి మొన్న ఇంగ్లాండ్ కౌంటిలలో టెస్ట్ మ్యాచ్లలో మళ్లీ తనదైన శైలిలో రాణించి సెంచరీ డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే ఇటీవలి కాలంలో రాయల్ లండన్ వన్డే కప్ లో భాగంగా చటేశ్వర్ పుజారా ఆడుతున్నాడు. అయితే ఇప్పటివరకు కేవలం బంతుల్లో తక్కువ పరుగులు చేసి నిలకడగా ఆడుతూ టెస్టు ఫార్మాట్లో నిలదొక్కుకోగలడు అని మాత్రమే తెలుసు.  కానీ చటేశ్వర్ పుజారా మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ సిక్సర్లతో చెలరేగి పోతాడు అన్న విషయం ఇటీవల రాయల్ వన్డే  కప్లో భాగంగా అతని బ్యాటింగ్ విధ్వంసం చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమైంది.



 ఇటీవలే ఇంగ్లాండ్ కౌంటీ వన్డే మ్యాచులలో అదరగొట్టాడు. బ్యాటింగ్ లో  చెలరేగిపోయాడు. మొత్తంగా తొమ్మిది మ్యాచ్ లలో 111 స్ట్రైక్ రేటుతో 624 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే దూకుడైన ఆట తీరుపై ఇటీవల స్పందించిన చటేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  గత ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి ప్రాతినిధ్యం వహించాను.  కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.  దీంతో నాదైన శైలిలో ధాటిగా బ్యాటింగ్ చేయడంపై ప్రాక్టీస్ చేశాను. ఇక ఇటీవలే తాను ఆడుతున్న రాయల్ వన్డే కప్ లో భాగంగా ధాటిగా ఆడి ఫలితం సాధించాను అంటూ చటేశ్వర్ పుజారా చెప్పుకొచ్చాడు.  పరుగుల వరద పారించిన పుజారాకు టీమిండియాలో చోటు దక్కుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: