ఐపీఎల్ లో అదిరిపోయే ప్రదర్శన చేసి ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ప్రదర్శన ఆధారంగా టీమిండియాలో చోటు దక్కించుకున్న ప్లేయర్ లు చాలామంది ఉన్నారు.  అలాంటి వారిలో కొంత మంది భారత జట్టులో ఒకప్పుడు తమను తాము నిరూపించుకునీ నిలదొక్కుకొని సార్ క్రికెటర్గా ఎదుగుతూ ఉంటే కొంతమంది మాత్రం రెండు మూడు మ్యాచ్లకే పరిమితం అయి చివరికి టీమిండియా జట్టులో చోటు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే ఇలా టీమిండియా లోకి వచ్చిన తక్కువ సమయంలోనే సూర్యకుమార్ యాదవ్ ఊహించని రీతిలో గుర్తింపును సంపాదించుకున్నాడు.


 అండర్-19 క్రికెట్ సమయంలో తన సహచరుడు అయినా రిషబ్ పంత్ ఎంతో ముందుగానే టీమిండియా జట్టు లోకి వస్తే అటు సూర్యకుమార్ యాదవ్ మాత్రం కాస్త లేటుగా టీమిండియా జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా అనే విధంగానే తన బ్యాటింగ్తో బుల్లెట్ లాంటి షాట్లు ఆడుతూ టీమిండియా లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ స్థానంలో మార్పులు వస్తూనే ఉన్నాయి.


 ఇకపోతే సూర్యకుమార్ యాదవ్ కు ఇష్టమైన బ్యాటింగ్ స్థానం ఏది అనేది మాత్రం ఎవరికీ తెలియదు అని చెప్పాలి. ఇటీవల ఇదే విషయమై మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను ప్రతి స్థానంలో కూడా బ్యాటింగ్ చేయడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాను. ఇక పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్కు వెళ్ళినప్పుడు మ్యాచ్ నియంత్రించేందుకు ప్రయత్నిస్తూ ఉంటాను. వేగంగా పరుగులు చేయడం వల్ల ఫినిషర్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. నాకు నాలుగవ స్థానంలో బ్యాటింగ్ చేయడం అంటే ఎంతో ఇష్టం అంటూ సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడం అనేది ఎప్పుడూ సవాలుతో కూడుకున్నది అని సూర్య కుమార్ యాదవ్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: