ఇటీవలే ముగిసిన ఆసియా కప్ లో భాగంగా భారత్ పేలవ  ప్రదర్శనతో నిరాశ పరిచిన తీరుపై ఇప్పటికి కూడా చర్చ జరుగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. టైటిల్ ఫేవరెట్ గా ఆసియా కప్లో బరిలోకి దిగిన భారత జట్టు వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించి అదరగొట్టింది. ప్రేక్షకుల అంచనాలను మరింత రెట్టింపు చేసింది అని చెప్పాలి. కానీ  ఆ తర్వాత కీలకమైన మ్యాచ్లలో ఓటమి చవిచూసిన భారత జట్టు ఇక సూపర్ 4 దశలోనే ఆసియా కప్ నుంచి ఇంటి బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇండియా ఫైనల్ కు చేరుకుంటుంది కప్పు కొడుతుంది అని అందరు భావించినప్పటికీ అలా జరగలేదు.


 దీంతో టీమిండియా అభిమానులు అందరూ కూడా నిరాశ లో మునిగి పోయారు. సూపర్ 4 దశలో తప్పక గెలవాల్సిన రెండు మ్యాచ్ లలో కూడా ఓడిపోయింది.  ఇక ఇటీవలే ఇదే విషయంపై స్పందించిన శ్రీలంక మాజీ క్రికెటర్ మహేలా జయవర్ధనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ లో నిరాశ పరిచినప్పటికీ ఇక ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరగబోయే టి20 వరల్డ్ కప్ లో మెరుగ రాణించగల క్వాలిటీ స్కిల్స్ ఉన్న ప్లేయర్ లు టీమిండియా లో ఉన్నారు అంటూ జయవర్ధనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. కొన్ని విభాగాల్లో టీమిండియా కొన్ని పొరపాట్లను సరిచేసుకోవాలి అంటూ సూచించాడు.


 ప్రతిభ నైపుణ్యం ఉన్నప్పటికీ అన్ని రంగాల్లోనూ భారత్ సత్తా చాటాల్సిన అవసరం ఉంది అంటూ తెలిపాడు. అయితే జస్ప్రిత్ బూమ్రా అందుబాటులో లేకపోవడమే ఆసియా కప్లో భారత పతనానికి కారణమైంది అంటూ  జయవర్ధనే తెలిపాడు. జస్ప్రిత్ బూమ్రా ఎల్లుండి  నుంచి ఆస్ట్రేలియా తో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కు అందుబాటులోకి రానున్నాడు. ఓవర్లలో బూమ్రా డెత్ ఓవర్లలో  అద్భుతంగా బౌలింగ్ చేస్తాడని.. అతను జట్టులోకి రావడం తో టీమిండియా పటిష్టంగా మారింది అని తెలిపాడు. అయితే టీమ్ ఇండియా లో ప్రతిభగల ఆటగాళ్లు ఉన్నప్పటికీ బౌలింగ్లో ఫీల్డింగ్ లో   కొంచెం ఆత్మవిశ్వాసం అవసరం  అంటూ చెప్పుకొచ్చాడు జయవర్ధనే.

మరింత సమాచారం తెలుసుకోండి: