ప్రస్తుతం టీమిండియా మహిళల జట్టు లో సీనియర్ క్రికెటర్ గా కొనసాగుతుంది ఝాలన్ గోస్వామి. ఇప్పటివరకు జట్టు తరఫున ఎన్నో ఏళ్ల పాటు సేవలు అందించింది తన అద్భుతమైన ప్రతిభతో కీలకమైన సమయంలో వికెట్లు పడగొట్టి ఇక టీమిండియా మహిళల జట్టు విజయాలు అందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ప్రస్తుతం ఇంగ్లాండ్తో భారత మహిళల జట్టు వన్డే సిరీస్ ఆడుతుంది. అయితే ఝాలన్ గోస్వామి కెరీర్లో ఇదే చివరి సిరీస్ కావడం గమనార్హం. మహిళల క్రికెట్లో ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన ఝాలన్ గోస్వామి ఇంకా రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉంది అని చెప్పాలి.


 ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన మొదటి మ్యాచ్లో టీమిండియా ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది అనే విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లో ఝాలన్ గోస్వామి 10 ఓవర్లు కోటాలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక కీలకమైన వికెట్లు పడగొట్టింది. ఈ క్రమంలోనే అది టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించేది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ ఒక్క వికెట్  పడగొట్టడం ద్వారా టీమిండియా వెటరన్ ఫేసర్ జులన్ గోస్వామి అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.



 ఇంగ్లాండ్ గడ్డపై ఇంగ్లాండ్ జట్టుపై అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా ఝాలన్ గోస్వామి రికార్డు సృష్టించింది. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఫేసర్ కేథరిన్ పేరిట ఉండేది. ఇంగ్లాండ్ గడ్డపై ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 23 వికెట్లు పడగొట్టింది.. ఇప్పుడు ఝాలన్ గోస్వామి 24 వికెట్లు పడగొట్టి అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది అనే చెప్పాలి. అంతే కాదు భారత్ తరపున వన్డేలలో ఆడిన అతిపెద్ద వయస్కురాలు గా కూడా ఝాలన్ గోస్వామి నిలిచింది. 39 ఏళ్ల 297 రోజుల వయసులో ఇటీవలే ఇంగ్లండ్తో తొలి వన్డే మ్యాచ్ ఆడిన ఝాలన్ గోస్వామి.

మరింత సమాచారం తెలుసుకోండి: