ఇటీవలే ఆసియా కప్ లో భాగంగా భారత జట్టు విఫలం అయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక అక్టోబర్ లో జరగబోయే టి20 వరల్డ్ కప్ లో ఎవరు ఎలా రాణించ బోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. టీమిండియా కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది అనే చెప్పాలి. ప్రస్తుతం ఫినిషర్ పాత్ర కోసం ఒక వైపు రిషబ్ పంత్ మరోవైపు దినేష్ కార్తీక్ మధ్య తీవ్ర స్థాయిలో పోటీ ఉంది అని చెప్పాలి.  ఇది అటు భారత సెలెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది అన్నది తెలుస్తుంది.


 ఇటీవల టి20 వరల్డ్ కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇందులో ప్రేక్షకులను ఆశ్చర్య పరిచే విషయం ఎక్కడా లేదు అని చెప్పాలి. ఒకటి రెండు మార్పులు మినహా దాదాపు ఆసియాకప్ ఆడిన జట్టుని అటు టి20 వరల్డ్ కప్ కు కూడా కొనసాగింది.  ఇందులో దినేష్ కార్తీక్ తో పాటు పంత్ కూడా చోటు దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే  ఈ ఇద్దరిలో తుది జట్టులోకి ఎవరిని తీసుకోవాలి అనే విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.


 ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎప్పటిలాగే ఆరుగురు బౌలర్లతో కాకుండా రోహిత్ శర్మ వచ్చే ప్రపంచ కప్ లో ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఐదుగురు బౌలర్లతో వెళ్లడమే మంచిదని చెప్పాడు. నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లు ఒకరు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మొత్తం ఐదుగురు బౌలర్లు అయితారు. ఇలాంటి కఠిన నిర్ణయాలు ద్వారానే రిస్కులు తీసుకోవాల్సి ఉంటుంది..  రిస్కులు తీసుకున్నప్పుడే కదా రివార్డులు కూడా వస్తాయి అంటూ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.



 అయితే 5 గురు బౌలర్ల ప్లాన్ మాత్రం అటు టీమిండియాకు అస్సలు అచ్చు రాలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆసియా కప్లో భాగంగా ఇదే ప్లాన్ తో బరిలోకి దిగిన టీమిండియా తీవ్రంగా నిరాశపరిచింది అన్న విషయం తెలిసిందే. టి20 ప్రపంచకప్ లో రిషబ్ పంత్ తో పాటు దినేష్ కార్తీక్ ను కూడా తీసుకోవాలని సూచించాడు. ఎందుకంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ బాగా కుదురుతుంది అంటూ తెలిపాడు. అంతేకాకుండా జట్టులో సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది అంటూ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. మరి టీమిండియా ఏం చేస్తుంది అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: