గత కొన్ని రోజుల నుంచి టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గురించి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది . ఎంతోమంది అతనిపై విమర్శలు చేస్తున్నారు. కారణం అతనికి తక్కువగా స్ట్రైక్ రేట్ ఉండటమే. గత కొంతకాలం  నుంచి ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పాలి. ఆసియా కప్ లో  అవకాశం దక్కించుకున్న కేఎల్ రాహుల్  అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఒకవైపు తన సహచరుడు గా ఉన్న మరో ఓపెనర్  కెప్టెన్ రోహిత్ శర్మ పవర్ ప్లే లో రెచ్చిపోతూ సిక్సర్లు ఫోర్లతో చెలరేగి పోతుంటే.. కేఎల్ రాహుల్ మాత్రం ఎంతో నెమ్మదిగా ఆడుతున్నాడు అంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు.


 ఆసియా కప్ లో అతని స్ట్రైక్ రేట్ 122.22 గా ఉంది. ఇటీవల మీడియా సమావేశంలో కూడా కేఎల్ రాహుల్ కు ఇలాంటి ప్రశ్న ఎదురైంది. ఈ క్రమంలోనే రియల్ రాహుల్ స్పందిస్తూ  తన ఫాం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఎంతోమంది నా స్ట్రైక్ రేట్ విషయంలో నన్ను విమర్శిస్తున్నారు. ప్రతి ఒక్కరూ  ఇదే విషయంపై మాట్లాడుతున్నారు. అలా అంటే ఈ విషయంలో ఎవరూ పరిపూర్ణులు కాదు. డ్రెస్సింగ్ రూమ్ లోని ప్రతి ఆటగాడు ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నాడు.  స్ట్రైక్ రేట్ అనేది కొన్ని మ్యాచ్ లలోనీ ప్రదర్శనను  పరిగణలోకి తీసుకొని చెప్పేది.   ఒక బ్యాట్స్ మాన్  ఎప్పుడూ ఒకే స్ట్రైక్ రేట్ తో ఆడటం కష్టం.


 ఏ ఆటగాడు అయినా సరే తన స్ట్రైక్ రేట్  ఎంత ఉండాలి అనుకుంటూ బ్యాటింగ్ చేయడు. జట్టు గెలుపుకు ఏం కావాలో అదే చేస్తూ ఉంటాడు. అవసరమైతే 200 స్ట్రైక్ రేట్ పర్లేదు అనుకుంటే 120 150 స్ట్రైక్ రేట్ తో ఆడుతాడు. అంతేకాదు బ్యాటింగ్ కు వచ్చిన సమయంలో నేను ఇంతే స్ట్రైక్ రేట్తో ఆడాలనీ ఏ బ్యాట్స్మెన్ కూడా అనుకోడు అంటూ కె.ఎల్.రాహుల్ చెప్పుకొచ్చాడు. వీటి గురించి ఆటగాళ్లు ఎవరు అనాలసిస్ చేసుకోరని.. కానీ అందరూ దీనినే భూతద్దంలో చూస్తూ ఉంటారు అంటూ కాస్త ఘాటుగానే సమాధానమిచ్చాడు కె.ఎల్.రాహుల్.

మరింత సమాచారం తెలుసుకోండి: