ఈ రోజు రాత్రి సరిగ్గా 7 గంటలకు ఇండియా మరియు ఆస్ట్రేలియా లాంటి ప్రపంచ అత్యుత్తమ జట్ల మధ్యన మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. వాస్తవానికి వరల్డ్ కప్ టీ 20 కి ఇంకా మూడు వారాలు మాత్రమే సమయం ఉన్నందున ఈ సిరీస్ ఇప్పుడు జరగడం రెండు జట్లకు దొరికిన అద్భుతమైన అవకాశం అని చెప్పాలి. ఈ అవకాశాన్ని రెండు జట్లలోని ఆటగాళ్లు అంతా ఉపయోగించుకుంటారని ఆశిద్దాం. కాగా ఈ రోజు మ్యాచ్ పంజాబ్ లోని మొహాలీ వేదికగా జరగనుంది. మొన్ననే ఆసియా కప్ ను పేలవంగా ముగించిన ఇండియాకు తిరిగి డాం ను దొరకబుచ్చుకోవడానికి ఛాన్స్ వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా ఆసియా కప్ నుండి ఎలిమినేట్ కావడంలో కారణం అయిన బౌలింగ్ ను పెంపొందించుకోవలసిన అవసరం ఉంది.

అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ మ్యాచ్ లో గెలుపు సాధించడం అంత సులభం కాదు. ఆస్ట్రేలియా జట్టు ఎప్పుడు ఏ విధమైన ప్రదర్శన ఇస్తుంది అనేది ఎవ్వరూ ఊహించలేము. రీసెంటుగా జింబాబ్వే చేతిలో ఓడిపోయి అప్రతిష్టను మూటగట్టుకుంది. అంత మాత్రాన తక్కువ అంచనా వేయకూడదు. అయితే ఇరు జట్లలోని ఆటగాళ్లను భయపెడుతున్న ఒకే ఒక విషయం... ఈ గ్రౌండ్ లో స్క్వేర్ బౌండరీలు చాలా లాంగ్ అని తెలుస్తోంది. గాల్లో షాట్ లు ఆడేవారు జాగ్రత్తగా ఆడకపోతే క్యాచ్ అవుట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక లెఫ్ట్ హ్యాండర్ లు ఎక్కువగా ఉన్న జట్టుకు గెలిచే అవకాశాలు ఉంద్నాఉన్నాయి.

అందుకే తుది జట్టులో ఆటగాళ్లు ఎవరు ఉండాలన్న విషయంపై కోచ్ మరియు కెప్టెన్ లు తర్జన భర్జన పడుతున్నారు. ఇండియా టీం లో కేవలం ఒక్క లెఫ్ట్ హ్యాండర్ మాత్రమే పంత్ రూపంలో ఉన్నాడు. ఒకవేళ అక్షర్ పటేల్ ను తీసుకుంటే ఇద్దరు అవుతారు. అదే ఆస్ట్రేలియా ను తీసుకుంటే... వెడ్ మరియు అష్టోన్ అగర ల రూపంలో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్ లు ఉన్నారు. ఇక మాక్స్వెల్ లెఫ్ట్ హ్యాండర్ లాగా స్విచ్ షాట్ లు ఆడగలిగే నైపుణ్యాన్ని కలిగి ఉన్నాడు...

మరింత సమాచారం తెలుసుకోండి: