ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్లలో ఒకటిగా ఇండియా క్రికెట్ టీం అని ఫార్మాట్ లలో తమదైన ఉత్తమ ప్రదర్శనతో దూసుకువెళుతోంది. కానీ ఇటీవల ఇండియా ప్రదర్శన మరీ తీసికట్టగా తయారైంది. కేవలం 20 రోజుల్లో టీ 20 వరల్డ్ కప్ ను పెట్టుకుని ఇలాంటి ప్రదర్శన చేయడం చాలా బాధాకరం అని చెప్పాలి. మొన్న ముగిసిన ఆసియా కప్ లోనూ ఫైనల్ కు చేరకుండా శ్రీలంక లాంటి జట్టు పై ఓడడం దురదృష్టం అని చెప్పడానికి మనసు అంగీకరించడం లేదు. ఇండియా ఇంతకు ముందు వరకు ఎలా ఆడేది ? ఇప్పుడు ఎలా ఆడుతోంది అన్నది ? ఒక్కసారి ప్రస్తుతం టీం లో కొనసాగుతున్న ప్లేయర్స్ అందరూ తమను తాము ప్రశ్నించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఇక నిన్న రాత్రి ఆస్ట్రేలియా తో జరిగిన మొదటి 20 మ్యాచ్ లో ఇండియా ఓటమిని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు కానీ ... బ్యాటింగ్ గురించి కానీ పెద్ద కంప్లైంట్స్ లేవు. ఉన్న 6 మంది బ్యాట్స్మన్ లలో ఏ ముగ్గురు రాణించినా పోటీ ఇవ్వగలిగే స్కోర్ ను సాధించవచ్చు. అయితే ఎంత స్కోర్ చేసినా దానిని డిఫెండ్ చేయగలిగే నైపుణ్యం మాత్రం బౌలర్ల  చేతుల్లోనే ఉంటుంది. కానీ అలాంటి బౌలర్లే విఫలం అయితే ? పరిస్థితి ఏమిటి ? సరిగ్గా రాత్రి మ్యాచ్ లో ఇదే జరిగింది.

ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్లలో ఒకరైన భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు తుక్కురేగొట్టారు. ఇతను తన బౌలింగ్ లో 4 ఓవర్ లలో 52 పరుగులు సమర్పించుకుని ఓటమికి కారణం అయ్యాడు. ఇక హర్షల్ పటేల్ ది అదే పరిస్థితి. ఈ ఇద్దరూ కూడా ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. ఒక్క అక్షర్ పటేల్ తప్ప మిగిలిన బౌలర్ ఎవ్వరూ ప్రభావం చూపకపోవడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారీగా షాట్ లు ఆడి మ్యాచ్ ను ఇండియా చేతుల్లోంచి లాగేసుకున్నారు. ఈ రకమైన ప్రదర్శనను ఇండియా అభిమాని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఈ ఓటమికి బాధ్యులు ఎవ్వరు అని చెప్పాలి. జట్టును మైదానంలో ముందుకు నడిపించి కెప్టెన్ దా ? లేక సరిగా ప్రదర్శన చేయని ఆటగాళ్లదా ? లేదా అటువంటి జట్టును సెలెక్ట్ చేసిన కోచ్ దా ? అంటూ అభిమానులు శివాలెత్తి పోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: