2022 టీ 20 వరల్డ్ కప్ కు ఇండియా తమ జట్టును ప్రకటించినప్పటి నుండి ఇండియన్ డేంజరస్ కీపర్ మరియు బ్యాట్స్మన్ అయిన రిషబ్ పంత్ సెలక్షన్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఎక్కువగా మాత్రం పంత్ ను సెలెక్ట్ చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు. క్రికెట్ గురించి అంతగా అవగాహన మరియు అనుభవం లేని వారు అంటే పర్వాలేదు.. వారికి తెలియదులే అలానే అంటారు అని, కానీ క్రికెట్ లో ఒకప్పుడు ఆడిన మాజీ క్రికెటర్లు కూడా రిషబ్ పంత్ సెలక్షన్ గురించి పెదవి విరుస్తున్నారు. ఈ పంత్ కు వ్యతిరేకంగా వినిపిస్తున్న ఈ కామెంట్స్ గురించి కొందరు ఖండిస్తున్నా ఎక్కువ శాతం మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు.

అసలు ఎందుకు పంత్ పై ఇంత వ్యతిరేకత అంటే సరైన సమాధానం చెప్పడం చాలా కష్టం.  రిషబ్ పంత్ అనే ఒక యువ క్రికెటర్ ఐపీఎల్ లో తనదైన ధనాధన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టి ఇండియా మెయిన్ టీం లోకి వచ్చాడు. అప్పటి నుండి నెమ్మదిగా ఆడుకుంటూ ఇండియన్ టీం లో మూడు ఫార్మాట్ లలోనూ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఒక ప్లేయర్ గా ఫెయిల్యూర్ అంది చాలా సాధారణం... ఈ విషయంలో ఎవ్వరూ మినహాయింపు కాదు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ధోని, కోహ్లీ ఇంకా చాలా మంది సరైన ఫామ్ లో లేక ఇబ్బందపడిన వారే. అంత మాత్రాన వారిని జట్టునుండి తొలగించలేరు. ఇక ప్రస్తుతం ఉన్న ఆటగాళ్ల విషయానికి వస్తే, కె ఎల్ రాహుల్ అడపా దడపా ఆడతాడు తప్ప... రెగ్యులర్ గా సరైన ప్రదర్శన చూపడు.

కెప్టెన్ రోహిత్ శర్మ పరిస్థితి కూడా దాదాపు అంతే.. ఇక ఇప్పుడు బీభత్సమైన ఫామ్ లో ఉన్న హార్దిక్ పాండ్య కూడా ఫామ్ లేక చాలా కాలం జట్టుకు దూరమయ్యాడు. ఇక వరల్డ్ కప్ లో పంత్ కు ప్లేస్ ఎందుకు అని ప్రశ్నిస్తున్న అందరికీ తానేమిటో నిరూపించుకుంటాడు... తన బలం అటాకింగ్... మ్యాచ్ ఒత్తిడిలో ఉన్నప్పుడు దిగి కొంచెం కుదురుకుని సమయంలో నెమ్మదిగా ఆడుతూ వికెట్ పారేసుకునేంత మాత్రాన పంత్ కు టాలెంట్ లేదని అనడం కాదు. ఆల్రెడీ పంత్ అంటే ఏమిటో నిరూపించుకున్నాడు కాబట్టే వరల్డ్ కప్ లో ఉన్నాడు. అల్ ది బెస్ట్ పంత్ .. విమర్శలను పట్టించుకుంటే అడుగు కూడా ముందుకు వేయలేవు.. జస్ట్ ఎంజాయ్ యువర్ నాచురల్ గేమ్.


మరింత సమాచారం తెలుసుకోండి: