ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు టీమిండియా పర్యటన లో ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ పర్యటనలో భాగంగా టి20 సిరీస్ ఆడుతోంది. ఈ టి20 సిరీస్ వరల్డ్ కప్ కి ముందు అటు ఆస్ట్రేలియాకు ఇటు టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ గా మారింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఇక ఇటీవల 3 టీ20ల సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ జరిగింది. మొదటి మ్యాచ్లో భాగంగా టీమ్ ఇండియా బౌలింగ్ విభాగం చేతులెత్తేయడంతో చివరికి భారత జట్టుకు ఓటమి తప్పలేదు.


 మొదటి మ్యాచ్లో భాగంగా భారత బ్యాటింగ్ విభాగం బాగా రాణించినప్పటికి బౌలింగ్ విభాగం మాత్రం జట్టును ఆదుకో లేకపోయింది. దీంతో భారత్ పై విజయం సాధించిన ఆస్ట్రేలియా 1-0 తేడాతో ఆధిక్యంలో  కొనసాగుతోంది. ఇక సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే టీం ఇండియా రెండో టి 20 మ్యాచ్ లో తప్పక గెలవాల్సి ఉంది. ఈ క్రమంలోనే రేపు నాగపూర్ లో విదర్భ స్టేడియం వేదికగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య రెండవ టీ20 మ్యాచ్ జరగబోతోంది. ఈ క్రమంలోనే మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది అని అందరూ  అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.


 ఇలాంటి సమయంలోనే మ్యాచ్ అసలు జరుగుతుందా లేదా అనే అనుమానం ప్రేక్షకుల్లో మొదలైంది. ఎందుకంటే నాగపూర్లోని విదర్భ స్టేడియంలో జరగబోయే రెండో టీ20 మ్యాచ్ కు వరుణ గండం పొంచి  ఉంది అని ఇటీవలే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దేశంలోని పలు రాష్ట్రాలకు వర్షసూచన ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలోని నాగపూర్ లో 70 శాతం వర్షం పడే అవకాశం ఉందట.  తద్వారా రెండవ టీ20 మ్యాచ్ లో పూర్తి శాతం ఆట సాధ్యంకాకపోవచ్చు అన్నది తెలుస్తుంది. మరి ఏం జరగబోతుంది అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: