ఒకవైపు భారత పురుషుల జట్టు మరోవైపు భారత మహిళల జట్టు కూడా ప్రస్తుతం వరుసగా సిరిస్ లతో బిజీబిజీగా గడుపుతున్నాయి అన్న విషయం తెలిసిందే. భారత మహిళల జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా.. ఇక భారత పురుషుల జట్టు ఇండియా పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా తో టీ20 సిరీస్ ఆడుతుంది. ఇక ఇరు జట్లు కూడా అదరగొడుతు ఉండటం గమనార్హం.  అయితే భారత మహిళల, పురుషుల జట్లు ఈ రెండూ కూడా ఒకే రకమైన రికార్డు సాధించాయి అని చెప్పాలి. భారత పురుషుల జట్టు ఇటీవల ఆస్ట్రేలియాతో మొదటి టి20 మ్యాచ్ ఆడింది.


 ఈ టి20 మ్యాచ్ లో భాగంగా భారత బ్యాట్స్మెన్లు అందరూ కూడా రెచ్చిపోయి వీర విహారం చేశారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగులు చేశారు. అయితే ఇప్పటి వరకు ఆస్ట్రేలియాపై ఇక 208 పరుగుల టీమిండియా చేసిన అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఇక మరో వైపు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత మహిళల జట్టు ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో అదిరిపోయే ప్రదర్శన చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. అయితే ఇంగ్లండ్ పై భారత మహిళల జట్టు ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం.


 ఇలా భారత మహిళల జట్టు మరోవైపు పురుషుల జట్టు ప్రత్యర్థులపై కెరీర్ లోనే అత్యధిక స్కోరు నమోదు చేయడం గమనార్హం. అయితే భారత మహిళల జట్టు రెండో వన్డే మ్యాచ్లో విజయం సాధిస్తే అటు కెరీర్లోనే అత్యధిక స్కోరు చేసిన భారత పురుషుల జట్టు మాత్రం మొదటి టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిచూసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  భారత మహిళా పురుషుల జట్లు అత్యధిక స్కోరు చేసి ఒకే రకమైన రికార్డులు  సాధించినప్పటికీ భారత పురుషుల జట్టు నిరాశ పరిస్తే అటు మహిళల జట్టు మాత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది  అంటూ కామెంట్ చేస్తున్నారు ఎంతో మంది నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: