టీమిండియా  లో జస్ప్రిత్ బూమ్రా ఎంత కీలకమైన బౌలర్గా కొనసాగుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  బుల్లెట్ లాంటి బంతులు విసురుతూ ఎప్పుడు ప్రత్యర్థులను భయ పెడుతూ ఉంటాడు జస్ప్రిత్ బూమ్రా.  కీలకమైన సమయం లో వికెట్లు పడగొట్టి టీమిండియా విజయం లో కీలక పాత్ర వహిస్తూ ఉంటాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు ఎన్నో సార్లు ఓడిపోయే మ్యాచ్ లలో కూడా అటు జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ తో మ్యాజిక్ చేసి టీమిండియాకు విజయాన్ని అందించిన సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి.  బుమ్రా ఇటీవలే గాయం బారినపడి జట్టుకు దూరమయ్యాడు.


 ఈ క్రమంలోనే బూమ్రా దూరమైన తర్వాత టీమ్ ఇండియా ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా జస్ప్రిత్ బూమ్రా లేని లోటు జట్టులో స్పష్టంగా కనిపించింది. ఇక బుమ్రా లేకపోవడం కారణంగానే ఆసియా కప్లో టీమ్ ఇండియా విఫలమైంది అని ఎంతో మంది అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. ఇటీవలే సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ-20 సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్లో బౌలింగ్ వైఫల్యం కారణంగానే టీమ్ ఇండియా పరాజయం పాలయింది. దీంతో జస్ప్రిత్ బూమ్రా త్వరగా జట్టులోకి రావాలని అభిమానులు అందరూ కోరుకుంటున్నారు.


 ఇలాంటి సమయం లోనే అందరికీ ఒక గుడ్ న్యూస్ అందింది అనే చెప్పాలి. రేపు జరగబోయే రెండవ టి20 మ్యాచ్ లో  బూమ్రా జట్టులో చేరబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఈ విషయాన్ని ప్రముఖ క్రికెట్ సైట్ క్రిక్ బజ్ తెలిపింది. జస్ప్రిత్ బూమ్రా వెన్నునొప్పి నుంచి కోలుకున్న ప్పటికీ ఇప్పుడిప్పుడే వెన్నుముక్క పై భారం వేయొద్దని.. తొలి టీ20లో బుమ్రాను ఆడించ లేదని  బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. నెట్స్ లో బౌలింగ్ చేయడం తగినంత రెస్టు దొరకడం కారణంగా రెండవ టీ20లో బుమ్రా అందుబాటులోకి వస్తాడు అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: