ప్రస్తుతం భారత మహిళల జట్టు లో కీలక ప్లేయర్గా కొనసాగుతుంది స్మృతి మందాన. ఇప్పటివరకూ తన బ్యాటింగ్ ప్రతిభతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది అనే చెప్పాలి. ఇక ప్రతి మ్యాచ్లో కూడా భారీగా పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటుంది. అయితే కేవలం తన బ్యాటింగ్  ప్రతిభ ద్వారా మాత్రమే కాకుండా తన చిరునవ్వుతో తన అందం అభినయంతో కూడా సోషల్ మీడియాలో స్టార్ రేంజ్ లో అభిమానుల మనసులు కొల్లగొట్టింది అన్న విషయం తెలిసిందే.


 అయితే స్మృతి మందాన బ్యాటింగ్ లో ఆడే మెరుపు ఇన్నింగ్స్ ఎప్పుడూ అభిమానులను ఆనందంలో ముంచేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలె టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మందన వన్డే క్రికెట్ లో సరికొత్త రికార్డ్ను క్రియేట్ చేసింది అని చెప్పాలి. ఏ మహిళా క్రికెటర్కు సాధ్యం కాని రీతిలో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది స్మృతి మందన. వన్డే ఫార్మాట్ లో వేగంగా మూడు వేల పరుగులు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్ గా రికార్డు కెక్కింది. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్లలో స్మృతి మందాన మూడవ స్థానంలో ఉండడం  గమనార్హం. ఈ  జాబితాలో శిఖర్ ధావన్ ముందు వరుసలో ఉన్నాడు.


 టీం ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ 72 ఇన్నింగ్స్ లలో వన్డే ఫార్మాట్లో మూడు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీ 75 ఇన్నింగ్స్ లలో మూడు వేల పరుగుల క్లబ్లో చేరాడు. ఇక ఇప్పుడు స్మృతి మందాన విరాట్ కోహ్లీకి ఒక్క ఇన్నింగ్స్ తేడాతో 76 ఇన్నింగ్సులో మూడు వేల పరుగుల  మైలురాయిని అందుకునీ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంది అని చెప్పాలి. అంతేకాదు గత నెలలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించిన ఐదుగురు క్రికెట్ సూపర్ స్టార్స్ లో కూడా స్మృతి మందాన చోటు దక్కించుకుని అరుదైన గౌరవం సొంతం చేసుకుంది. అయితే మిథాలీ, రాజ్ హర్మన్ ప్రీత్ కౌర్ ల తర్వాత భారత మహిళా క్రికెటర్ లలో మూడు వేల పరుగుల మైలురాయిని దాటిన మూడో క్రికెటర్గా స్మృతి మందాన రికార్డు క్రియేట్ చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: