ఇటీవలికాలంలో టీమ్ ఇండియా లో బ్యాటింగ్ కాంబినేషన్ అస్సలు సెట్ కావడం లేదు అన్న విషయం తెలిసిందే . గత కొంత కాలం నుంచి ఇదే విషయంపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా  ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌గా ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న రోహిత్ శర్మ ఎందుకో మునుపటిలా రాణించలేక పోతున్నాడు. పెద్దగా స్కోర్లు చేయలేకపోతున్నాడు. తక్కువ పరుగులకే వికెట్ కోల్పోతున్నాడు. అయితే జట్టులో కీలకమైన ఆటగాడిగా ఉన్న రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని ఇవ్వకుండా వికెట్ కోల్పోతున్న నేపథ్యంలో  మిగతా బ్యాట్స్మెన్లు ఒత్తిడిలో పడి పోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇక ఇటీవలే మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో కూడా తొమ్మిది బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ కేవలం 11 పరుగులు మాత్రమే చేసి వికెట్ కోల్పోయాడు. ఇకపోతే రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన పై పాకిస్థాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా ఇటీవలే తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆర్డర్ మారిస్తే బాగుంటుంది అని చెప్పుకొచ్చాడు.  రోహిత్ శర్మ ఇటీవల కాలంలో పెద్దగా పరుగులు రాబట్ట లేకపోతున్నాడు.


 ఆసియా కప్ లో కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఆరంభంలో భాగానే షాట్స్ ఆడుతున్నప్పటికీ ఇక భారీ స్కోర్లు చేయడంలో మాత్రం విఫలం అవుతూనే ఉన్నాడు. అందుకే రోహిత్ శర్మ తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మూడోస్థానానికి మార్చుకుంటే బాగుంటుంది. లేదా కె.ఎల్.రాహుల్ ను వన్ డౌన్ లో ఆడించాలి.  మంచి ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీనీ ఓపెనర్‌గా ఆడితే టీమిండియాకు ఉపయోగం ఉంటుంది అంటూ పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు డానిష్ కనేరియా చెప్పుకొచ్చాడు. కాగా ఇటీవలే ముగిసిన ఆసియా కప్‌లో ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ టీమిండియా తరఫున 276 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: