ప్రస్తుతం టీమిండియా జట్టు భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టుతో టి-20 సిరీస్ ఆడుతోంది. సొంత గడ్డపై మ్యాచులు జరుగుతున్న నేపథ్యం లో ఆస్ట్రేలియా పై  టీమిండియా పూర్తి ఆధిపత్యం సాధించటం ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ టీమిండియా అభిమానులు అనుకున్నది ఒకటి మొదటి టి20 మ్యాచ్ లో జరిగింది మరొకటి. మొదటి టి20 మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 208 పరుగులు చేసింది.  ఈ క్రమం లోనే టీమిండియా గెలిచినట్లే అని గట్టిగా ఫిక్స్ అయ్యారు అభిమానులు. కానీ భారత బౌలింగ్ విభాగం పెద్దగా ఆకట్టు కోలేకపోయింది.


 భారీగా పరుగులు సమర్పించుకున్నారు. తద్వారా పెద్ద టార్గెట్ ను ఆస్ట్రేలియా ముందు ఉంచినప్పటికీ అటు టీమిండియా మాత్రం గెలవలేక పోయింది. దీంతో నేడు జరగ బోయే రెండో టి 20 మ్యాచ్ టీమిండియాకు చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ గా మారి పోయింది. ఎందుకంటే మొదటి మ్యాచ్లో ఓడి పోయిన టీమిండియా సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే రెండవ టీ 20 మ్యాచ్ లో తప్పక గెలవాల్సి ఉంటుంది.


 ఒకవేళ 2వ టి20 లో కూడా టీమిండియా ఓడిపోతే సొంత గడ్డపై ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాకు సిరీస్ కట్టబెట్టి చివరికి పరువు పోగొట్టుకొంటుంది. ఈ క్రమం లోనే 2వా టి20 మ్యాచ్ టీమ్ ఇండియాకు ఎంతో ప్రతిష్టాత్మకమైనది అని చెప్పాలి. అయితే రెండో టీ20 మ్యాచ్ లో బుమ్రా అందుబాటు లోకి వచ్చే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. తద్వారా బౌలింగ్ విభాగం ఎంతో పటిష్టం గా మారుతుందని అభిమానులు అనుకుంటున్నారు. మరి నేడు జరగబోయే డూ ఆర్ డై మ్యాచ్లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.  అదే సమయంలో వరుణ గండం కూడా ఉంది అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: