టీం ఇండియా వరల్డ్ కప్ కు ముందు అభిమానులలో టెన్షన్ ను కలిగిస్తోంది. ఇటీవల ఆసియా కప్ లో కొనసాగించిన పేలవమైన ప్రదర్శననే మొన్న ఆస్ట్రేలియా తో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్ లో ఇండియా కోనసాగించింది. బ్యాటింగ్ పరంగా బలంగానే ఉన్న ఇండియా... బౌలింగ్ మరియు ఫీల్డింగ్ లలో కీలక సమయంలో తప్పిదాలు చేస్తూ భారీ మూల్యాన్ని చెల్లించుకుంటోంది. దీనితో ఒక్కసారిగా టీం ఇండియా పై అభిమానులు, మాజీలు అందరూ విమర్శల దాడిని ఆరంభించారు. ఈ ఓటమికి కారణం అయిన వారి మీద ట్రోల్స్ తో విరుచుకుపడ్డారు. అయితే ఎంత మంది విమర్శించినా ఫైనల్ గా ఉత్తమ ప్రదర్శన చేయాల్సింది మళ్ళీ ఆ 15 మంది కావడం విశేషం.

కాబట్టి వారిపై కోపాన్ని ప్రదర్శించకుండా తగిన మద్దతును మరియు ధైర్యాన్ని ఇవ్వాలంటూ కొందరు టీం ఇండియా పై సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు. అయితే ఆస్ట్రేలియా తో మొత్తం మూడు టీ 20 లు ఆడాల్సి ఉండగా, ఇంకా మిగిలిన రెండు మ్యాచ్ లలో రెండూ గెలిస్తేనే సిరీస్ మన సొంతం అవుతుంది. ఒకవేళ రెండింటిలో ఒకటి ఓడిపోయినా సిరీస్ పోతుంది. అయితే అలా జరగడం ప్రపంచ కప్ కు ముందు ఏ మాత్రం మంచిది కాదు. కాగా ప్రస్తుతం ఇండియా ఆవేశంలో ఉంది. రేపు నాగపూర్ వేదికగా రెండవ టీ 20 జరగనుంది.

కోచ్ మరియు కెప్టెన్ రేపటి మ్యాచ్ లో గెలుపొందాడు ఏమేమి వ్యూహాలను రెడీ చేసుకుంటున్నారు అన్నది చూడాలి. ఇక జట్టు కూర్పులో కూడా మార్పులు ఎక్కువగా ఉండొచ్చు అని తెలుస్తోంది. ముఖ్యంగా గత మ్యాచ్ లో విఫలం అయిన హర్షల్ పటేల్ , భువి లను పక్కన పెట్టడానికి ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి. వీరికి బదులుగా దీపక్ చాహర్ మరియు బుమ్రా లు జట్టులోకి రానున్నారు. ఇక చాహల్ స్థానంలో అశ్విన్ కు అవకాశం ఇచ్చే అవకాశం కూడా కొట్టిపారెయ్యలేము. మరి ఆకలిగొన్న పులిలా ఉన్న టీం ఇండియా ప్రతీకారం తీర్చుకుంటుందా అన్నది తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: