సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో ఫీల్డర్లు పరుగులు ఆపడానికి సాయశక్తులా ప్రయత్నించడం లాంటివి చూస్తూ ఉంటారు. ఒకవేళ బంతి ఫోర్ వెళ్తుంది అని భావిస్తే ఎంతో దూరం నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి ఏకంగా డైవ్ చేసి మరీ బంతిని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎంతో మంది ఆటగాళ్లు.  ఈ క్రమంలోనే ఇలాంటి రిస్కులు చేసే కొన్ని కొన్ని సార్లు గాయాల బారిన కూడా పడుతూ ఉంటారు. కానీ బంతి పక్కనుంచి ఫోర్ వెళ్తుంటే ఇక దాన్ని ఏదో సినిమా చూస్తున్నట్లుగా చూస్తూ ఉండిపోయాడు ఇక్కడ ఒక ఫీల్డర్. ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


రోడ్ సేఫ్టీ వరల్డ్ లో భాగంగా ప్రస్తుతం ఎంతో మంది మాజీ ఆటగాళ్లు మళ్లీ బరిలోకి దిగి క్రికెట్ ఆడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజాలు మళ్లీ మైదానంలోకి దిగి క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతుంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా లెజెండ్స్ వర్సెస్ బంగ్లాదేశ్ లెజెండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది.



 ఇందులో భాగంగా 19 ఓవర్లలో ఆస్ట్రేలియా లెజెండ్స్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. లాస్ట్ ఓవర్లో విజయానికి 21 పరుగులు కావాలి. క్రీజ్లో కుదురుకున్నాడంటే బ్రాడ్ హదిన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. కాగా అబుల్ హాసన్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. తొలి బంతికే యర్కర్ కావడంతో పరుగులు రాలేదు. రెండో బంతికి సిక్సర్ గా వెళ్ళింది.. ఆ సమయంలో నాలుగు బంతుల్లో 15 పరుగులు సమీకరణ మారింది.. మూడో బంతి హసన్  నో బాల్ వేసాడు.  2 పరుగులు వచ్చాయి. 3 బంతుల్లో 12 ఫోర్లు కావాలి. ఇక మూడో బంతి ఫోర్ గా వెళ్ళింది. అయితే నాలుగో బంతి సేమ్ టు సేమ్ అదే ప్లేస్ కి  వెళ్ళింది. కానీ అంతకుముందు బంతిని ఆపడానికి డైవ్ చేసిన ఫీల్డర్ బంతిని అందుకునే ప్రయత్నం చేయలేదు. కనీసం కాలు కూడా కదపలేదు. దీంతో కెప్టెన్ బౌలర్ సైతం ఆశ్చర్యపోయారు. ఈ వీడియో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: