ఇటీవల కాలంలో టీమిండియాలో ఆటగాళ్ల బ్యాటింగ్ ఆర్డర్ పై సర్వత్రా చర్చ జరుగుతోంది  అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఐపీఎల్ లో ప్రదర్శన ఆధారంగా టీమిండియాలోకి వచ్చి ఇక టీమిండియాలో ఫినిషర్ అనే ట్యాగ్ తగిలించుకున్న దినేష్ కార్తీక్ గురించి ఎంతో మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. చివర్లో వచ్చిన మెరుపు ఇన్నింగ్స్ ఆడి భారీ పరుగులు చేసిన నేపథ్యంలో అతనికి ఫినిషెర్ ట్యాగ్ తగిలించింది బీసీసీఐ. చివరకు కొన్ని మ్యాచ్ లలో  అదిరిపోయే ప్రదర్శన తో ఆకట్టుకున్నాడు.


 అయితే మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత టీమిండియాకు చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫినిషర్ దొరికాడు అని అభిమానులు ఆనంద పడేది లోపే అతని స్థానాన్ని బీసీసీఐ ప్రశ్నార్థకం చేసింది. సాధారణంగా ఫినిషెర్ అంటే చివరిగా వచ్చి ధాటిగా ఆడటం అని అందరికీ తెలుసు. ఐపీఎల్ తర్వాత టీం ఇండియా లో ఆడిన ప్రతి మ్యాచ్లో దినేష్ కార్తీక్ ఇదే చేస్తూ వస్తున్నాడు. అదే సమయంలో ఇక చివర్లో అతనికి అవకాశాలు కూడా తక్కువ గానే వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్మెన్ మ్యాథ్యూ హెడెన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 దినేష్ కార్తీక్ ను అవమానించాలని కాదు అసలు అతని రోల్ ఏంటి అనేది నాకు క్లారిటీ లేదు అంటూ వ్యాఖ్యానించాడు. ఫినిషర్  అనేవాడు పూర్తిస్థాయి బ్యాట్స్మన్లు అవుట్ అయిన తర్వాత బరిలోకి దిగుతాడు. కానీ ఆల్ రౌండర్ తర్వాత దినేష్ కార్తీక్ బ్యాటింగ్ కు రావడం అంతుచిక్కని ప్రశ్నగా మారి పోయింది. ఒకవేళ ఇలా చేస్తే కెప్టెన్ రోహిత్ స్ట్రాటజీ  మాత్రం వర్కవుట్ కాదు అని చెప్పగలను. అందుకోసం బ్యాటింగ్ ఆర్డర్ లో దినేష్ కార్తీక్ కి ప్రమోషన్ ఇవ్వాల్సిందే. దినేష్ కార్తీక్ లో ఉన్న ఫినిషింగ్ టాలెంట్ ను బాగా వాడుకోవాలి అంటూ మాథ్యూ హెడెన్ సూచించాడు. మరి రెండో టీ20లో దినేష్ కార్తీక్ ఏ స్థానంలో బ్యాటింగ్కు వస్తాడో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dk