గత కొంతకాలం నుంచి టీమిండియాలో ఐపీఎల్లో రాణించిన యువ క్రికెటర్లదే హవా ఎక్కువగా నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ లో వివిధ జట్ల తరపున అద్భుతంగా రాణించడంతో ఇక తమ ప్రతిభతో సెలెక్టర్లు చూపును ఆకర్షించడం ఆ తర్వాత ఒకసారి ఇక టీమిండియాలో అవకాశం దక్కించుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇక ఇలా అవకాశం దక్కించుకున్న వారిలో ప్రస్తుతం టీమిండియా లో మిస్టర్ 360 ప్లేయర్ గా గుర్తింపు సంపాదించుకున్న సూర్యకుమార్ యాదవ్ కూడా ఒకడు అన్న విషయం తెలిసిందే.


 అప్పుడెప్పుడో అండర్ 19 సమయంలో రిషబ్ పంత్ తో కలిసి ఆడాడు సూర్యకుమార్ యాదవ్. రిషబ్ పంత్ ఎప్పుడో టీమిండియాలో అవకాశం దక్కించుకుంటే.. సూర్య కుమార్ కు మాత్రం కాస్త ఆలస్యంగానే జట్టులో చోటు దక్కింది. ఎప్పుడు వచ్చాం అన్నది కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా అన్న విధంగా ప్రస్తుతం సూర్య కుమార్ ప్రదర్శన ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తక్కువ సమయంలోనే తన బ్యాటింగ్ శైలి తో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఈ క్రమంలోనే క్రికెట్ ఫాన్స్ అందర్నీ కూడా అతని బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి.


 మైదానం లోని అన్ని వైపులా అద్భుతమైన షాట్లు ఆడుతూ తనకు తిరుగులేదని నిరూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే భారత అభిమానులు అందరూ కూడా అతన్ని మిస్టర్ 360 ప్లేయర్ అని ప్రేమగా పిలుచుకోవడం కూడా మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు అన్నది తెలుస్తుంది. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన అంతర్జాతీయ టి20 లలో సూర్యకుమార్ యాదవ్  613 పరుగులతో అత్యధిక పరుగులు సాధించి నెంబర్ వన్ లో ఉన్నాడు.  ఇక అతని తరువాత నికోలస్ పూరన్ 553 పరుగులతో రెండవ స్థానంలో..  నిస్సంక 499 పరుగుల తో మూడో స్థానం ఉన్నారు. రోమన్ పావెల్ 1
(449), శ్రేయస్ అయ్యర్  (449)పరుగులు, రోహిత్ శర్మ (434) ఇషన్ కిషన్ (430) పరుగులతో తర్వాత స్థానంలో కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: