ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు పాకిస్థాన్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఇంగ్లాండ్ మధ్య టి20 సిరీస్ జరుగుతుంది. అయితే ఈ టి 20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్లో పాకిస్థాన్ జట్టుపై ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించి పాకిస్థాన్ను చిత్తుగా ఓడించింది అనే విషయం తెలిసిందే. దీంతో పాకిస్థాన్ జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా గత కొంత కాలం నుంచి పరుగులు తీయ లేక ఇబ్బంది పడుతున్న బాబర్ ను టార్గెట్ చేస్తూ ఎంతో మంది విమర్శలు చేశారు. కానీ ఇటీవల జరిగిన రెండో టీ-20 మ్యాచ్లో మాత్రం పాకిస్తాన్ జట్టు అనూహ్యంగా పుంజుకుంది అనే చెప్పాలి.


 మొదటి మ్యాచ్లో తమపై పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచిన ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టును పాకిస్థాన్ జట్టు పది వికెట్ల తేడాతో మట్టికరిపించి ఘన విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్ లో ఇటీవలే పాకిస్థాన్ సాధించిన భారీ విజయం గురించి అందరూ చర్చించుకుంటూ ఉండటం గమనార్హం. అయితే గత కొంత కాలం నుంచి ఫామ్ కోల్పోయే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాం ఇటీవల ఇంగ్లాండ్లో జరిగిన రెండో టీ-20 మ్యాచ్లో మాత్రం అదిరిపోయే ప్రదర్శన తో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే సెంచరీ చేసి అభిమానులందరినీ కూడా ఆనందంలో ముంచేశాడు. ఈ మ్యాచ్లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు అయితే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి అటు ఇంగ్లాండ్ జట్టుకు షాక్ ఇచ్చింది అని చెప్పాలి. కెప్టెన్ బాబర్ 66 బంతుల్లో 115 పరుగులు చేసి సెంచరీతో చెలరేగాడు. ఇందులో ఐదు సిక్సర్లు 11 ఫోర్లు ఉండటం గమనార్హం. ఇక మరో ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ 51 బంతుల్లో 88 పరుగులు చేయడం గమనార్హం. తద్వారా పది వికెట్ల తేడాతో విజయం సాధించింది పాకిస్థాన్ జట్టు..

మరింత సమాచారం తెలుసుకోండి: