టీమిండియాలో ఎన్నో ఏళ్ల పాటు సేవలందించిన సౌరవ్ గంగూలీ లెజెండరీ క్రికెటర్ లలో ఒకడిగా చేరి పోయాడు అన్న విషయం తెలిసిందే. తన కెప్టెన్సీలో టీమిండియాకు సరికొత్త దూకుడు నేర్పించాడు. ఈ క్రమంలోనే తన ఆటతీరుతో టీమిండియాకు సరికొత్త క్రేజ్ తీసుకొచ్చి పెట్టాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా ఎన్నో ఏళ్ల పాటు టీమిండియాలో సేవలందించిన సౌరవ్ గంగూలీ ఇక ఇప్పుడు ఏకంగా బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ తీసుకుంటున్న నిర్ణయాలు ఎప్పటికప్పుడు సంచలనంగా మారిపోతున్నాయి.



 భారత క్రికెట్ నియంత్రణ మండలిని ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్ బోర్డు గా మార్చేందుకు తనదైన శైలిలో ప్రణాళికాబద్ధంగా పక్కా ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నారు సౌరవ్ గంగూలీ. అయితే ప్రస్తుతం బిసిసిఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సౌరవ్ గంగూలీ కి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ సెన్సేషన్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఆ వార్త ఏదో కాదు ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ త్వరలో ఐసీసీ చైర్మన్ పీఠాన్ని అధిరోహించ బోతున్నారు అంటూ ఒక టాక్ చక్కర్లు కొడుతుంది.


 అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు బిసిసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పలుమార్లు స్పందించి క్లారిటీ ఇచ్చినప్పటికీ ఈ ప్రచారం మాత్రం ఆగడం లేదు అని చెప్పాలి. ఇటీవలే మరో సారి ఇదే విషయంపై స్పందించాడు గంగూలీ. ఐసీసీ చైర్మన్ పదవి అనేది తన చేతుల్లో లేదని సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. బిసిసీఐ అధ్యక్ష పదవి కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఐసీసీ చైర్మన్ అవుతాను అన్న ప్రచారంలో నిజం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో ఇక రిటైర్మెంట్ ప్రకటించబోతున్న ఉమెన్ సీనియర్ క్రికెటర్ ఝాలన్ గోస్వామి చేసిన సేవలపై స్పందించాడు. ఆమె ఒక ఛాంపియన్ క్రికెటర్.. ఎంతో మంది యువతకు ఆదర్శంగా మారిందంటూ సౌరవ్ గంగూలీ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: