ఆస్ట్రేలియా మరియు ఇండియా జట్ల మధ్యన ఈ రోజు రెండవ టీ జరగనున్న విషయం తెలిసిందే. ఇంకాసేపట్లో నాగపూర్ వేదికగా మ్యాచ్ స్టార్ట్ కానుంది. గత మ్యాచ్ లో లాగా టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకుని ఛేజింగ్ కే మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే మొదటి మ్యాచ్ లో బౌలింగ్ మరియు ఫీల్డింగ్ పొరపాట్లతో మ్యాచ్ ను పోగొట్టుకున్న రోహిత్ సేనకు ఇది చాలా కఠినమైన సమయం అని చెప్పాలి. ఇండియా ఫ్యాన్స్ అంతా కూడా ఈ మ్యాచ్ కోసం ఎంతగన్ ఎదురుచూస్తున్నారు. ప్రపంచ క్రికెట్ జట్లను ఆటాడించే ఇండియాను 209 పరుగులు ఛేదించి ఓడించడం అంటే మాములు విషయం కాదు. అయితే స్పష్టంగా  తెలుస్తున్న తప్పిదం కీలక మ్యాచ్ లో కీలక ఆటగాళ్ల క్యాచ్ లను వదిలి మ్యాచ్ ఓటమికి కారణం అయ్యారు.

ఇక ఆసియా కప్ నుండి కీలక మ్యాచ్ లలో స్టార్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఫెయిల్ అవుతున్నాడు.. ముఖ్యంగా పెనల్టిమేట్ ఓవర్ లలో భారీగా పరుగులు ఇచ్చుకుని మ్యాచ్ ఓటమికి కారణం అవుతున్నాడు. అందుకే ఈ మ్యాచ్ లో అలాంటి పొరపాట్లు జరగకుండా ప్రత్యర్థి ఆస్ట్రేలియాను ఓడించాలన్న ప్లాన్ తో రంగంలోకి దిగుతోంది. ఈపాటికే మ్యాచ్ జరుగుతూ ఉండాల్సింది...గత రాత్రి వరుణుడు ప్రభావంతో పిచ్ పై అక్కడక్కడా ప్యాచ్ లు ఉన్నాయి. దీనితో అంపైర్ లు పలుమార్లు ఇన్స్పెక్షన్ చేశారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం మరో అరగంట తర్వాత గమనించి మ్యాచ్ ఆడడం వీలవుతుందా లేదా అన్నది అంపైర్లు ప్రకటించనున్నారు.

అయితే వరుణుడు మ్యాచ్ ను కనుక అడ్డుకుంటే ఇండియా సిరీస్ న్యూ చేజార్చుకునే ప్రమాదం ఉంది. లేదా మిగిలిన ఆఖరి మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేస్తారా అన్నది చూడాలి. మరి మ్యాచ్ జరుగుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.  










   

మరింత సమాచారం తెలుసుకోండి: