టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ లో ఎంతలా గుర్తింపు సంపాదించుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్ల లిస్టు తీస్తే అందులో రోహిత్ శర్మ పేరు మొదటి వరుసలోని వినిపిస్తుంది అని చెప్పాలి. అంతలా తన ఆట తీరుతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు రోహిత్ శర్మ. కేవలం భారత దేశంలో మాత్రమే కాదు ఇతర దేశాలలో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు అని చెప్పాలి. ఇక టీమిండియాలో హిట్ మ్యాన్ అనే ఒక బిరుదును కూడా దక్కించుకున్నాడు. అంతే కాదు అభిమానులు అందరూ రోహిత్ శర్మను డబుల్ సెంచరీల వీరుడు సిక్సర్ల ధీరుడు అని పిలుచుకోవడం కూడా చేస్తూ ఉంటారు అని చెప్పాలి.


 ముఖ్యంగా టి20 ఫార్మాట్ లో రోహిత్ శర్మ సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు ఓపనర్ గా  బరిలోకి దిగుతూ సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతూ అదరగొడుతూ ఉంటాడు అని చెప్పాలి. ఈ క్రమంలోని అదిరిపోయే ప్రదర్శనతో ఎప్పుడు ప్రేక్షకులను ఆనందంలో ముంచేస్తూ ఉంటాడు. కాగా ఇప్పటివరకు టి20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్ గా అంతర్జాతీయ క్రికెట్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు రోహిత్ శర్మ. అయితే పరుగుల విషయంలోనే కాదు సిక్సర్ల విషయంలో కూడా రోహిత్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ ఉన్నాడు అన్నది తెలుస్తూ ఉంది.


 ప్రస్తుతం టీమిండియా భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ ఆడుతుంది.  కాగా ఇటీవలే రెండో టి20 మ్యాచ్ జరుగగా ఇక రోహిత్ శర్మ సిక్సర్లు పోర్లతో చెలరేగిపోయాడు. ఒక అరుదైన రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండవ టి20 మ్యాచ్ లో హేజిల్ వుడ్ బౌలింగ్ లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ అంతర్జాతీయ టి20 చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రికెటర్ గా నిలిచాడు.. అంతర్జాతీయ టి20లలో 133 మ్యాచ్లో 176 సిక్సర్లు కొట్టాడు రోహిత్ శర్మ.  అతని తర్వాత న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ మార్టిన్ గప్తిల్ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: