ఇటీవల కాలంలో టీమిండియాలో ఇద్దరు ఆటగాళ్ల ఎంపిక విషయంలో తీవ్రస్థాయిలో కన్ఫ్యూజన్ నెలకొంది అన్న విషయం తెలిసిందే. టీమిండియాలో గొప్ప క్రికెటర్ గా ఎదిగి ఫినిషిర్ గా గుర్తింపు సంపాదించుకున్న రిషబ్ పంత్.. ఈ ఏడాది ఐపిఎల్ లో అద్భుత ప్రదర్శన కారణంగా టీమిండియా జట్టులోకి వచ్చి ఇక అదే ఊపును కొనసాగిస్తున్న దినేష్ కార్తీక్ ఇద్దరిలో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలి అనే విషయంపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంది. ఇక ఇద్దరు వికెట్ కీపర్లే కావడం మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే వారే కావడంతో వీరి లో ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలి అన్నది కూడా సెలక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది.


 ఈ క్రమంలోనే ఇద్దరు కలిసే జట్టులో ఆడిన సందర్భాలు చాలా తక్కువ అని చెప్పాలి. కానీ ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ టి20 మ్యాచ్లో మాత్రం ఇద్దరికీ తుదిచెట్టులో చోటు దక్కింది. రిషబ్ పంత్ వికెట్ కీపర్ గానే బాధ్యతలు నిర్వహించాడు. ఈ మ్యాచ్ లో భాగంగా చివర్లో వచ్చిన దినేష్ కార్తీక్  రెండు బంతుల్లో పది పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు  అయితే ఆస్ట్రేలియా తో విజయం అనంతరం మీడియాతో మాట్లాడిన దినేష్ కార్తీక్ కు రిపోర్టర్ల నుంచి వింత ప్రశ్నలు ఎదురయ్యయ్. రెండవ టి20 లో రిషబ్ పంత్ జట్టులో ఎందుకు ఉన్నాడు అంటూ విలేకరులు ప్రశ్నించారు.


 ఇక ఈ ప్రశ్నకు దినేష్ కార్తీక్ స్పందిస్తూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. వర్షం కారణంగా మ్యాచ్ ఎనిమిది ఓవర్లకు కుదించారు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మకు ఐదుగురు బౌలర్లు ఆప్షన్ అవసరం లేకుండా పోయింది. జట్టులో నలుగురు బౌలర్లు ఉంటే చాలు అయితే హార్దిక్  రూపంలో అయిదవ బౌలర్ ఉండనే ఉన్నాడు. అయితే ఓవర్లు కుదించినప్పుడు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లు ఎక్కువగా ఉండాలి. అందుకే తనతో పాటు రిషబ్ పంత్ కూడా జట్టులో ఉన్నాడు. మరి తర్వాత మ్యాచ్లో ఉంటాడా అంటే మాత్రం చెప్పలేను అంటూ దినేష్ కార్తీక్ రిప్లై ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: