గత కొంతకాలం నుంచి పేలువమైన ఫాంతో ఇబ్బంది పడుతున్నాడు రోహిత్ శర్మ. మొదట్లో సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోతున్నప్పటికీ ఇక తక్కువ పరుగులు చేసి వికెట్లు కోల్పోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. మంచి ఆరంభం ఇస్తున్న వాటిని భారీ స్కోర్లుగా మాత్రం మలచలేకపోతున్నాడు రోహిత్ శర్మ. వెరసి కెప్టెన్సీ ఇన్నింగ్స్ మాత్రం ఆడలేక పోతున్నాడు అని చెప్పాలి. ఇలా ఓపెనర్ గా వచ్చి పేలవ ప్రదర్శన చేస్తున్న నేపథ్యంలో కెప్టెన్ అయ్యుండి కూడా జట్టును కష్టాల్లోకి నెడుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే అతనిపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి.



 ఇకపోతే ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో మాత్రం 8 ఓవర్లు ఉన్న సమయంలో రావడం రావడమే సిక్సర్లు ఫోన్లతో చెలరేగిపోయాడు. దాటిగా ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక రోహిత్ బ్యాటింగ్ పై స్పందించిన మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యల చేస్తాడు. రెండవ టి20 మ్యాచ్లో రోహిత్ బాగా ఆడటానికి గల కారణాలను చెప్పుకొచ్చాడు. రెండవ టి 20 మ్యాచ్లో రోహిత్ చాలా జాగ్రత్తగా ఆడాడు. చాలా సెలెక్టివ్ గా షాట్లను బాదాడు. సాధారణంగా ఫ్లిప్ షాట్లు, ఫుల్ షాట్లు అతడు బాగా ఆడతాడు. అతని బ్యాటింగ్లో బలమైన ఇలాంటి షాట్లతోనే మళ్లీ అలరించాడు. బాల్ కట్ చేసిన విధానం ఫుల్ చేసిన విధానం అద్భుతం. అయితే కెప్టెన్సి ఇన్నింగ్స్ ఆడేందుకు అతను క్రీజ్ లోకి రాలేదు.


 మంచి ఫినిషింగ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు అంటూ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. అయితే ఆఫ్ సైడ్ లో ఆడాలని చూసినప్పుడే రోహిత్ ఇబ్బంది పడుతున్నాడు అంటూ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. అతను స్టాండ్స్ లోకి కాకుండా గాల్లోకి బంతిని లేపుతున్నాడు. ఇది ఒక్క విషయంలో అతను కాస్త జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది అంటూ సునీల్ గవాస్కర్  చెప్పుకొచ్చాడు. కాగా 20 పంతులు 43 పరుగులు చేసిన రోహిత్ శర్మ జట్టుకు విజయాన్ని అందించాడు. మరి నేడు హైదరాబాద్ వేదికగా జరగబోతున్న నిర్ణయాత్మకమైన మూడవ టి20 మ్యాచ్ లో అటు టీమ్ ఇండియా ఎలా రాణిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: