విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్లో అత్యుత్తమ  ఆటగాడిగా  కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే రికార్డుల రారాజుగా ప్రత్యేకమైన బిరుదు కూడా అందుకున్నాడు   క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడి గానే కాదు అటు సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ అథ్లెట్ గా కూడా విరాట్ కోహ్లీ క్రేజ్ సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఇక రోజు రోజుకు ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటూ సోషల్ మీడియాలో కూడా రికార్డులు సృష్టిస్తున్నాడు.


 ఇక ఇంత పాపులారిటీ ఉన్న విరాట్ కోహ్లీ గురించి ఏదైనా విషయం సోషల్ మీడియాలోకి అది వైరల్ గా మారకుండా ఉంటుందా.. ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ గురించి ఒక విషయం వైరల్ గా మారిపోయింది. సాధారణంగా విరాట్ కోహ్లీ తన డైట్ విషయంలో ఎంత ఖర్చుతత్వంతో  ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే అతను తాగే వాటర్ కూడా ఎంతో కాస్లీ అన్న విషయం గతంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు అతని హెయిర్ స్టైల్ గురించిన చర్చ జరుగుతోంది.


 ఇటీవల విరాట్ కోహ్లీ ఒక కొత్త హెయిర్ స్టైల్ లో కనిపించాడు. అయితే విరాట్ కోహ్లీ హెయిర్ స్టైల్ కి కూడా సోషల్ మీడియాలో బాగానే పాపులారిటీ ఉంది. ఈ క్రమంలోనే కొత్త హెయిర్ స్టైల్ తో కోహ్లీ ఫోటోలకు ఫోజులు ఇవ్వగా  సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే ఈ హెయిర్ స్టైల్ గురించి చర్చ మొదలైంది. అయితే కోహ్లీ కొత్త హెయిర్ కట్ డిజైన్ కు దాదాపు 80000 ఖర్చు అయ్యాయట. ఈ విషయం తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.అదే హెయిర్ స్టైల్ 100, 150 లో చేయించగలము అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: