గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాలో ఓపెనింగ్ జోడి పై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. అయితే ఆసియా కప్ ముందు వరకు కూడా కేఎల్ రాహుల్ గాయం కారణంగా జట్టుకు అందుబాటులో లేకపోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు ఓపెనర్ గా మరో బ్యాట్స్మెన్ ఎవరైతే బాగుంటుంది అనే విషయంపై టీం ఇండియా ఎన్నో ప్రయోగాలు చేసింది. కొన్నిసార్లు రిషబ్ పంత్ మరికొన్నిసార్లు సూర్యకుమార్ యాదవ్ లను ఓపెనర్లుగా పరీక్షించింది. రిషబ్ పంత్ ఓపెనర్ గా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా సూర్య కుమార్ యాదవ్ మాత్రం పరవాలేదనిపించాడు.


 ఇక కేఎల్ రాహుల్ మళ్లీ జట్టులోకి రావడంతో అతన్నే ఓపెనర్ గా కొనసాగిస్తున్నారు. అయితే కేఎల్ రాహుల్ మాత్రం మునుపటిలా దాటిగా ఆడలేక పోతున్నాడు. అతను కుదురుకోవడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆసియా కప్ లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఓపెనర్ గా వచ్చిన విరాట్ కోహ్లీ సెంచరీ తో చలరేగిపోయాడు. దీంతో ఓపెనింగ్ జోడి ఎవరైతే బాగుంటుంది అనే విషయంపై మరోసారి చేర్చే మొదలైంది. ఇక ఎంతోమంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

 టీమిండియా ఓపెనర్లుగా రోహిత్ శర్మ కే ఎల్ రాహుల్ ఉంటేనే బాగుంటుంది అంటూ భారత మాజీ కోచ్ రవి శాస్త్రి అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఒకవేళ వాళ్ళిద్దరిలో ఎవరైనా జట్టుకు అందుబాటులో లేకపోతే అప్పుడు ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలి అంటూ సూచించాడు రవి శాస్త్రి. ఓపెనింగ్ స్థానంపై తరచూ చర్చ జరగడం రాహుల్ ని మానసికంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ప్రపంచ కప్ కు సిద్ధమవుతున్న కేఎల్ రాహుల్ ఆలోచన తీరును ఇది దెబ్బతీసే అవకాశం ఉంది ప్రస్తుతం కేఎల్ రాహుల్ తన మునుపటి లయ అందుకున్నాడు అతని బుర్రను పాడు చేయొద్దు అంటూ రవి శాస్త్రి సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: