గత కొంతకాలం నుంచి టి20 ఫార్మాట్లో అత్యుత్తమ బౌలర్లుగా కొనసాగుతూ ఉన్నారు భారత స్టార్ బౌలర్ బుమ్రా, పాకిస్తాన్ బౌలర్ షాహీన్ ఆఫ్రిది. అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ అదరగొడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల ఇద్దరు కూడా గాయం బారిన పడి తమ జట్టుకు దూరమయ్యారు. గాయం నుంచి కోలుకొని మళ్ళీ జట్టులోకి వచ్చిన తర్వాత అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఆస్ట్రేలియా తో జరిగిన రెండవ టి20 లో అరంగేట్రం చేసిన బుమ్రా మరోసారి తన యార్కర్లతో మ్యాజిక్ చేసి చూపించాడు.


 మరో వైపు షాహిన్  అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో జరగబోయే ప్రపంచ కప్ లో ఈ ఇద్దరు కూడా మంచి ప్రదర్శన చేయడం ఖాయం అన్నది మాత్రం ప్రస్తుతం తెలుస్తుంది. కాగా ఇద్దరిలో ఎవరు అత్యుత్తమ బౌలర్ అనే విషయంపై ఇటీవలే రికీ పాంటింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షాహిన్ ఆఫ్రిది కంటే జస్ ప్రిత్ బూమ్రా గొప్ప అంటూ ఆన్సర్ ఇచ్చాడు. ఇటీవల ఐసీసీ రివ్యూ లో భాగంగా  బుమ్రా గొప్ప లేకపోతే షాహిన్ గొప్ప అనే ప్రశ్నను బుమ్రా భార్య సంజన గణేషన్ రికీ పాంటింగ్ ను అడిగింది.


  ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే ఎవరి పేరు చెబుతాము. గత రెండు సంవత్సరాలుగా కూడా అన్ని ఫార్మట్ లలో ఇద్దరు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ఉన్నారు. ఇక నా ఉద్దేశం ప్రకారం అయితే టి20 ప్రపంచ కప్ లో బుమ్రా మెరుగ్గా రాణించగలడు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వరకు అతను ఆస్ట్రేలియాలో ఎంతో క్రికెట్ ఆడాడు. ఈ క్రమంలోని ఆఫ్రిది కంటే బుమ్రా ఎక్కువ అనుభవాన్ని పొందాడు. అంతేకాదు షాహిన్ ఆఫ్రిది తో పోల్చి చూస్తే బుమ్రా  పెద్ద టోర్నిలు ఎక్కువగా ఆడాడు అంటూ రికీ పాంటింగ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: