ఇటీవలే భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్లో భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ మన కడింగ్ చేయడం క్రికెట్ ప్రపంచంలో తీవ్ర చర్చకు దారితీసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దీప్తి శర్మ చేసింది కరెక్టే అంటూ కొంతమంది మద్దతుగా నిలుస్తూ ఉంటే క్రీడా స్ఫూర్తి కి ఆమె విరుద్ధంగా ప్రవర్తించింది అంటూ మరి కొంతమంది విమర్శలు చేస్తూ ఉండడం గమనార్హం. గతంలో 2019లో ఐపిఎల్ లో జోష్ బట్లర్ ను మన్కడింగ్ చేసిన సమయంలో అశ్విన్ ట్రోల్ చేసిన వారు ఇక ఇప్పుడు దీప్తి శర్మ ని కూడా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.. ఇలాంటి సమయంలో కొంతమంది కొత్త వివాదాలను తెరమీదికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.


 ఏ రన్ అవుట్.. ఇలా మ్యాచ్ ఫినిష్ అవడం దారుణాతి దారుణం.. అంటూ స్టువర్టు బ్రాడ్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. నేను ఆడిన ప్లేయర్లలో 90 శాతం మంది బ్యాట్ అంచుకి బాల్ తగిలినా కూడా గ్రీజు వదలలేదు. కానీ ఒక శాతం మంది మాత్రమే వికెట్ తీయడానికి మన్కడింగ్  విధానం వాడుతూ ఉంటారు. స్లిప్ లో క్యాచ్ ఇచ్చి క్రీజు వదలకపోతే అది ఇంకా దారుణం. రన్ అవుట్ కాదు. మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ కూడా తన కొడుక్కి క్రికెట్ 'లా' నేర్పించాలి అనుకుంటా అంటూ వ్యాఖ్యానిస్తూ.. సచిన్ టెండూల్కర్ వీడియోని షేర్ చేశాడు.


బ్యాట్ అంచుకు తగిలిన క్రిజు వదలని ప్లేయర్ల గురించి వెయ్యి ఉదాహరణలు చెబుతా.. అంటూ సచిన్ టెండుల్కర్ లక్కీగా మిస్ అయ్యాడు అంటూ వ్యాఖ్యానించాడు.  అయితే ఇక్కడే అటు సచిన్ టెండూల్కర్ ఫ్యాన్స్ కి మండింది. అనవసరమైన వివాదంలోకి సచిన్ టెండూల్కర్ ని ఎందుకు లాగుతున్నారు అంటూ ఇక స్టువర్టు బ్రాడ్ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు సచిన్ అభిమానులు. ఎన్నోసార్లు ఎంపైర్లు తప్పుడు నిర్ణయాలు ఇచ్చిన చిరునవ్వుతోనే పెవెలియన్ చేరాడు సచిన్. అలాంటి వ్యక్తిని గురించి ఇలాంటి వివాదాల్లోకి లాగడం తగదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: