గత కొంత కాలం నుంచి టీమ్ ఇండియా ఎంతో పటిష్టం గా కనిపిస్తున్నప్పటికీ బౌలింగ్లో లోపాలు మాత్రం ఎప్పుడు టీమిండియాను వేదిస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే  జట్టు లో కీలక బౌలర్ గా కొనసాగిన బుమ్రా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యడు. దీంతో అతను లేని లోటు స్పష్టంగా కనిపించింది. అతను లేకుండా మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపించ లేకపోయారు. డెత్ ఓవర్ లలో ఎక్కువ పరుగులు సమర్పించుకుంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు అని చెప్పాలి.


 గాయం నుంచి కోలుకున్న బుమ్రా ఎట్టకేలకు జట్టులోకి వచ్చాడు. ఇక అతని రాకతో టీమ్ ఇండియా బౌలింగ్ విభాగం ఎంతో పటిష్టంగా మారిపోయింది అని అందరు భావించారు. ఈ క్రమంలోని రెండవ టి20 మ్యాచ్లో బుమ్రా మళ్ళీ తనతో స్టయిల్ లో బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే డెత్ ఓవర్లలో పరుగులు ఇచ్చే సమస్య టీమిండియా కు తీరిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా నిర్ణత్మకమైన మూడవ టి20 మ్యాచ్ లో మాత్రం బుమ్రా  పెద్దగా రానించలేకపోయాడు అని చెప్పాలి.. తన బౌలింగ్ తో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు.


 ఒక రకంగా పరుగులు కట్టడి చేయాల్సిన బుమ్రా తన బౌలింగ్ లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అతను ఎక్కడ బంతి వేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు ఉతికి ఆరేసారు అని చెప్పాలి. నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా ఒక వికెట్ కూడా తీయకుండా 50 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక మరో  సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 3 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చాడు.  కానీ ఒక వికెట్ పడగొట్టాడు. ఇక చాహల్ మాత్రం నాలుగు ఓవర్లు వేసి కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి అందరికంటే మంచి ఎకానమీ నమోదు చేశాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: