ఇటీవలే భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాను ఓడించింది భారత జట్టు.  రెండు మ్యాచ్లలో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది అన్న విషయం తెలిసిందే. తద్వారా టి20 వరల్డ్ కప్ కి ముందు ఈ సిరీస్ విజయంతో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంపొందించుకుంది. ఇకపోతే ఉప్పల్ వేదికగా జరిగిన మూడవ టి20 మ్యాచ్లో భాగంగా ఒకవైపు విరాట్ కోహ్లీ క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడితే ఇంకోవైపు సూర్య కుమార్ యాదవ్ మాస్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే. ఉప్పల్ స్టేడియం విరాట్ కోహ్లీ కి బాగా అచ్చొచ్చిన  స్టేడియం అని టాక్ కూడా ఉంది.


 ఇక ఈ విషయాన్ని మరోసారి భారీగా పరుగులు చేసి నిరూపించాడు. విరాట్ కోహ్లీ 48 బంతుల్లో 68 పరుగులు చేశాడు. తద్వారా భారత జట్టు విజయంలో కీలకపాత్ర వహించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక మరో ఎండులో ఉన్న సూర్య కుమార్ యాదవ్ దాటిగా ఆడుతుండడంతో తన బ్యాటింగ్ వేగాన్ని కాస్త తగ్గించాడు అని చెప్పాలి. భారత జట్టు ఘనవిజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియా తమ ముందు నిర్దేశించిన 187 పరుగులు లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో చేదించింది అని చెప్పాలి. ఇకపోతే తన బ్యాటింగ్ స్ట్రాటజీ ఏంటి అన్న విషయాన్ని ఇటీవల విరాట్ కోహ్లీ వెల్లడించాడు.


 తన బ్యాటింగ్ స్ట్రాటజీ మారడానికి కెప్టెన్ రోహిత్ శర్మ కోచ్ రాహుల్ ద్రవిడ్లు పలు సూచనలు చేశారు అంటూ పేర్కొన్నాడు విరాట్ కోహ్లీ. ఒక ఎండ్ లో సూర్య కుమార్ యాదవ్ భారీగా హెట్టింగ్ చేస్తున్న సమయంలో నేను ఒకసారి డగవుట్ వైపు చూశాను. కెప్టెన్ రోహిత్ కోచ్ ద్రావిడ్ లు.. నువ్వు అలాగే నిలకడగా బ్యాటింగ్ చేస్తూ ఉండు.. అని అర్థం వచ్చేలా సైగలు చేశారు. ఎందుకంటే సూర్య కుమార్ బాగా ఆడుతున్నాడు. కాబట్టి మంచి భాగస్వామ్యం నిర్మించాలని సూచించాడు. దీంతో నా ఎక్స్పీరియన్స్ ఉపయోగించి నిదానంగా ఆడాను. ఇక సూర్య వికెట్ కోల్పోయి పెవిలియన్ చేరినప్పుడు మళ్లీ హిట్టింగ్ చేసేందుకు ప్రయత్నించాను అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: