గత కొన్ని రోజుల నుంచి  టీమిండియా బ్యాట్స్మెన్ సంజు శాంసన్  బీసీసీఐ సెలెక్టర్లు వ్యవహరించిన విధానంపై అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ సంజు సాంసన్ ఎందుకు ప్రపంచ కప్ జట్టులో ఎంపిక చేయలేదు అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే అభిమానులు అలాంటి డిమాండ్లు చేయకూడదని సంజు శాంసన్ స్వయంగా స్పందించినప్పటికీ కూడా అభిమానులు ఇక సంజు శాంసన్  ను వరల్డ్ కప్లోకి సెలక్ట్ చేయకపోవడం విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోని ఎక్కడికి వెళ్లినా సంజు శాంసన్  అంటూ గట్టిగా అరుస్తూ ఉండడం కనిపిస్తూ ఉంది. ఇకపోతే వరల్డ్ కప్ కి ముందు టీమిండియా వరుసగా టీ20 సిరీస్ లు ఆడుతుంది.  ఇటీవల ఆస్ట్రేలియా తో టి20 సిరీస్ ను విజయవంతంగా ముగించుకుంది. ఇక ఇప్పుడు దక్షిణాఫ్రికా తో పోరుకు సిద్ధమైంది భారత్ జట్టు.  స్వదేశంలో సెప్టెంబర్ 28వ తేదీ నుంచి తిరువనంతరం వేదికగా మొదటి టి20 మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఇక దక్షిణాఫ్రికాతో తొలి టి20 కోసం తిరువనంతపురంలో అడుగుపెట్టిన భారత జట్టుకు నిరసన సెగ తగిలింది.


 టి20 ప్రపంచ కప్ లో చోటు దక్కని సంజు శాంసన్  కు మద్దతుగా అభిమానులు భారీ సంఖ్యలో ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే భారత క్రికెటర్లు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే సంజు సంజు అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టారు.  అయితే సంజు సాంసంగ్ కి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా అతని సొంత రాష్ట్రం అయినా కేరళలో అయితే డై హార్డ్ ఫాన్స్ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను భారత్ కెప్టెన్ రోహిత్ తో పాటు చాహల్ అశ్విన్ కూడా తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే తిరువనంతపురంలో జరగబోయే టి మొదటి టి20 మ్యాచ్ సందర్భంగా సంజు అభిమానులు స్టేడియంలో నిరసన చేపట్టాలని భావిస్తున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: